Heart Attack Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. గుండె పోటు వచ్చే ప్రమాదం..!

గుండె పోటు సమస్య లేదా గుండె అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. చాతిలో నొప్పి, శ్వాస పీల్చడంలో ఇబ్బంది, నీరసంగా అనిపించడం, గుండె దడగా అనిపించడం, ఎక్కువగా చెమట రావడం, కాళ్లలో వాపు, వంటి లక్షణాలు గుండె పోటుకు సంకేతాలు.

New Update
Heart Attack Symptoms:  మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. గుండె పోటు వచ్చే ప్రమాదం..!

Heart Attack Symptoms: ఈ మధ్య కాలం చాలా మంది హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. కొంత మంది చిన్న వయసులోనే గుండె పోటుకు బలవుతున్నారు. ఇలా సడన్ గా గుండె పోటుతో మరణించడానికి చాలా కారణాలే ఉన్నాయి. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి వ్యాధులు,  వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించలేకపోవడం ఇవ్వని గుండె పోటు మరణాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యం పాడైనప్పుడు లేదా.. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే .. నిర్లక్ష్యం చేయకుండ తగిన జాగ్రత్తలు తీసుకోండి.

గుండె సమస్యలు వచ్చే ముందు కనిపించే లక్షణాలు

చాతిలో విపరీతమైన నొప్పి

చాతిలో నొప్పి, గట్టిగా పట్టేసినట్లు అనిపించడం, ఒత్తిడి, లేదా చాతిలో ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తే అది మీ గుండె సమస్యకు సంకేతం. మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.

శ్వాస పీల్చడంలో ఇబ్బంది

మరో భయంకరమైన సంకేతం .. ఊపిరి పీల్చడంలో ఇబ్బంది. ఏదైనా కొంచం పని చేసిన సరే.. అలసిపోవడం, ఆయాసంగా అనిపించడం జరుగుతుంది. ఖాళీగా.. రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పటికీ ఊపిరాడకపోవడం, శ్వాస పీల్చడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది.

నీరసంగా అనిపించడం

రోజు పనులు చేసుకోలేనంత నీరసంగా అనిపించడం.. ఏ పని చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె శరీర భాగాలకు సరిగ్గా రక్తం సరఫరా చేయలేనందు వల్లే శక్తిని కోల్పోయి నీరసం వస్తుంది. గుండెలో సమస్య ఉందని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక సంకేతం.

ఏదైనా నొప్పి, లేదా ఒత్తిడిగా అనిపించడం

ఒత్తిడిగా అనిపించడం.. ముఖ్యంగా ఎడమ భుజం లేదా ఎడమ చేతిలో నొప్పిగా అనిపిస్తే ఇది గుండె పోటు వచ్చే ప్రమాదానికి సంకేతమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండ డాక్టర్ ను సంప్రదించండి.

ఎక్కువగా చెమట రావడం, వాంతులు కావడం

కొన్ని సార్లు గుండె సమస్య ఉన్నప్పుడు శరీరంలో నుంచి విపరీతమైన చెమట వస్తుంది. అలాగే గుండె దడగా అనిపించడం లేదా హార్ట్ సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో వాంతులు కూడా ఎక్కువగా అవుతుంటాయి. ఇలాంటి లక్షణాలన్నీ గుండె సమస్యకు సంకేతాలు.

కొన్ని సార్లు ఈ లక్షణాలు ఇతర కారణాల వల్ల కూడా వస్తాయి. కానీ గుండె పోటుకు ఇవి ప్రముఖ సంకేతాలు. కావున నిర్లక్ష్యం చేయకుండ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సలహాలు తీసుకోవడం మంచిది.

Also Read: Sprouts Health: రోజు వీటిని తింటే.. ఆరోగ్య సమస్యలన్నీ మాయం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు