Health Tips: మంచి నిద్రకు చక్కటి పరిష్కారం... ఇలా చేస్తే ప్రశాంతతకు లోటు ఉండదు ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడమే కష్టంగా ఉంటుంది. అయితే నిద్రలో కొంతమంది చిన్నపిల్లలు పళ్లు కొరుకుతుంటారు. చిన్న పిల్లల పేగుల్లో పురుగులు ఉన్నా, మెగ్నీషియం, కాల్షియం లోపాలు ఉంటే ఇలా జరుగుతుందని సమాచారం. అందుకే చిన్న పిల్లలకు పోషకాహారం ఎక్కువగా ఇస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Oct 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నిద్రలో మీకు పళ్లు కొరికే అలవాటు ఉందా? చాలా మందికి నిద్రపోయే సమయంలో పళ్లను కొరుకుతుంటారు. కానీ.. అసలు విషయం ఏమిటంటే కొంతమందికి నిద్రలో దంతాలను కొరికేది పెద్దగా తెలియదు. అయితే.. కొంతమంది పళ్లు కొరికితే బయటకు పెద్ద శబ్ధం వస్తుంది. పళ్లను కొరుకుతున్నట్లు నిద్రించేవారికి అస్సలు తెలియదు. దీనిని డాక్టర్ల పరిభాషలో బ్రక్సిజం అని అంటారు. ఈ "బ్రక్సిజం" ఎలా వస్తుందనేదానిపై ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు.. కానీ నిపుణులు మాత్రం కొన్ని కారణాలను చెబుతున్నారు. విషయంపై ఇంకా స్పష్టత సమాచరం లేదు మనిషి ఎక్కువ ఒత్తిడి, నిరాశ, కోపం, ఆందోళన, ఉద్రిక్తత ఎక్కువగా ఉంటే నిద్రలో ఇలా పళ్లు కొరుకుతారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే నిద్రలో పళ్లు కొరకడం ఎందుకు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాకపోతే మానసిక సమస్యలు అధికంగా ఉన్నవారే ఇలా చేస్తారన్నది వైద్య నిపుణులు అంటున్న మాట. నిద్రలో పళ్లను కొరికిన వారు ఆ విషయాన్ని గ్రహించలేరు. కానీ.. పక్కన నిద్రపోయే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే చిన్న పిల్లల్లో మాత్రం పళ్లను కొరకడం వేరే కారణాల వల్ల వస్తుందని చెబుతున్నారు. పిల్లలకు పోషకాహారం ఎక్కువగా ఇస్తే.. చిన్న పిల్లల పేగుల్లో పురుగులు ఉన్నా, మెగ్నీషియం, కాల్షియం లోపాలు ఉంటే చిన్నారులు నిద్రలో పళ్లను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్న పిల్లలకు పోషకాహారం ఎక్కువగా ఇస్తే ఈ సమస్య నుంచి బయట పడి జీవితంలో మళ్లి సమస్యలు రాకుండా ఉంటుందని చెబుతున్నారు. పెద్దల్లో మాత్రం ఈ సమస్య తగ్గేందుకు ప్రత్యేకమైన మాత్రలు అనేవి ఏమీ ఉండవు. ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే దానిని కొంచెం తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు. అంతేకాకుండా మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు రాత్రి సమయంలో పాలల్లో పసుపు కలుపుకొని తాగిన హెర్బల్ టీలను తాగుతున్న ఈ సమస్య నుంచి కొంచెం బయటపడవచ్చు. అంతేకాకుండా వీటితోపాటు ప్రతిరోజు వాకింగ్, యోగా, ధ్యానం చేస్తే పళ్లు కొరికే సమస్య నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పట్టు దుస్తుల్లో రాశీ ఖన్నా అందాల రచ్చ #helth-benefits #grind-your-teeth #your-sleep మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి