అర్ధరాత్రి దాక నిద్రపోకపోతే మీరు డేంజర్లో ఉన్నట్టే.... అర్ధరాత్రి వరకూ ఫోన్లు చూస్తున్నారా....నిద్ర మానుకుని లేట్ నైట్ పార్టీలకు వెళ్తున్నారా... ఆఫీస్‌లో రాత్రంతా పని చేస్తున్నారా... అయితే మీ ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడ్డట్లే. ముఖ్యంగా యువత. సరైన నిద్ర లేకపోతే యువతలో మెదడు సరిగ్గా అభివృద్ధి చెందదని ఓ నివేదిక వెల్లడించింది. 10 నుంచి 21 ఏళ్ల వయసు వరకూ మెదడు ప్రాథమిక మార్గాల్లో అభివృద్ధి చెందుతుందని వెల్లడించింది. By Shareef Pasha 29 Jun 2023 in లైఫ్ స్టైల్ Scrolling New Update షేర్ చేయండి మానవుని మెదడు ఇలా అభివృద్ధి చెందడానికి నాణ్యమైన నిద్ర చాలా అవసరమని హ్యూమన్ స్లీప్ రీసెర్చ్ ప్రోగ్రాం డైరెక్టర్ ఫియోనా బేకర్ వెల్లడించారు. నిద్ర... ఆరోగ్యం మీద పెను ప్రభావం చూపిస్తుందని ఈ నివేదిక తేల్చి చెప్పింది. యువత తగినంత సమయం నిద్రపోతే మెదడు ప్రభావవంతంగా మారుతుందని వెల్లడించింది. యుక్త వయస్సులో నిద్రలేమి ఉంటే... అది మెదడు అభివృద్ధి సహా మొత్తం ఆరోగ్యంపై పూడ్చలేని ప్రభావం చూపుతుందని వివరించింది. కౌమార దశలో ఆరోగ్య ప్రవర్తన, భావోద్వేగాల అదుపునకు, సమగ్రాభివృద్ధికి తగినంత, నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యమని బెకర్ తేల్చి చెప్పారు. నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరుగడం... సామాజిక, మానసిక ఇబ్బందులతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు. అందుకే యుక్త వయసులో తగినంత నిద్రపోవాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. అర్ధరాత్రుళ్లు ఫోన్ వాడడం... ఆందోళన, మద్యం తాగడం.. నిద్రకు భంగం కలిగిస్తాయని దీని వల్ల మెదడు అభివృద్ధి సమగ్రంగా జరగదని ఈ నివేదిక తెలిపింది. బెడ్‌రూమ్‌లో టీవీ, ఇంటర్నెట్ ఉన్నవారు 28 శాతం నిద్రకు దూరం అయ్యారని ఈ అధ్యయనం వెల్లడించింది. సినిమాలు, వీడియో గేమ్‌లు, సంగీతం వినడం, ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వంటి వాటి వల్ల యువత నిద్ర లేమితో బాధపడుతుందని వివరించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఫోన్ వాడకం పెరిగిందని.. ఇది టీనేజర్ల నిద్రపై శాశ్వత ప్రభావాలను చూపుతుందని మరో అధ్యయనం తెలిపింది. నిద్రకు ముందు 30 నిమిషాల ముందు స్క్రీన్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. టీనేజ్ నిద్రపై హానికరమైన ప్రభావాన్ని చూపే కార్యకలాపాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరమని ఈ నివేదిక తెలిపింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి