/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Health-Insurance-jpg.webp)
Health Insurance Claim: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడంలో ఎదురవుతున్న సమస్యలకు త్వరలో తెరపడనుంది. ప్రజల సౌకర్యార్థం నేషనల్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఈ కొత్త సెటిల్‌మెంట్ పోర్టల్ ఉద్దేశ్యం క్లెయిమ్‌లు తీసుకోవడంలో జాప్యాన్ని తగ్గించడమే.
Health Insurence Claim: అందుతున్న సమాచారం ప్రకారం ఈ పోర్టల్ ప్రారంభించిన సమయం నుండి భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 50 బీమా కంపెనీలను, 250 ఆసుపత్రులను ఇందులో చేర్చగా, క్రమంగా మరిన్ని ఆసుపత్రులు, బీమా ప్రొవైడర్లను ఇందులో చేర్చనున్నారు. సులభమైన, వేగవంతమైన ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను సులభతరం చేయడానికి ఈ జాతీయ పోర్టల్ ప్రారంభించబడుతోంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆసుపత్రులు .. బీమా పాలసీదారుల మధ్య సింగిల్ విండో ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఈ పోర్టల్ ప్రభుత్వ జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్‌లో భాగం అవుతుంది.
రెండు మూడు నెలల్లో ప్రారంభించనున్నారు
Health Insurance Claim: వచ్చే రెండు మూడు నెలల్లో నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ ప్రారంభం కానుంది. ఇది ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల ప్రక్రియను సులభతరం చేయడానికి పని చేస్తుంది. అలాగే, బీమా పాలసీదారులు .. సర్వీస్ ప్రొవైడర్ల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి ఇది ఒక సమీకృత వేదికగా పని చేస్తుంది. సమాచారం ప్రకారం. ఈ పోర్టల్‌ను నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) అభివృద్ధి చేసింది. దీనిని బీమా క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి .. పరస్పర చర్యను నిర్వహించడానికి రూపొందించారు. టాటా ఎఐజి జనరల్ ఇన్సూరెన్స్, పారామౌంట్ టిపిఎ .. బజాజ్ అలయన్జ్ ఇన్సూరెన్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు ఇప్పటికే పోర్టల్‌తో తమ అనుసంధానాన్ని పూర్తి చేశాయని సోర్సెస్ చెబుతున్నాయి.
Also Read: ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బే.. డబ్బు.. ఎందుకు.. ఎలా వచ్చింది?
మాన్యువల్ గా ఎక్కువ సమయం..
Health Insurance Claim: ప్రస్తుతం, దేశంలో ఆరోగ్య బీమా క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ ప్రధానంగా మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. హాస్పిటల్‌లు వేర్వేరు క్లెయిమ్ పోర్టల్‌లను కలిగి ఉంటాయి .. ప్రతి పోర్టల్‌లో లబ్ధిదారులు వేర్వేరు ప్రశ్నలు అడుగుతారు, ఇది మరింత క్లిష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఒకే పోర్టల్ రాకతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.