Health Tips: పుచ్చకాయ తొక్కలో ఎన్ని లాభాలున్నాయో తెలుస్తే..చెత్తబుట్టలో వేయరు.!

శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయలో గుజ్జును మాత్రమే తింటాము. తొక్కలను చెత్తబుట్టలో వేస్తాము. తొక్కల వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..?తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
Health Tips: పుచ్చకాయ తొక్కలో ఎన్ని లాభాలున్నాయో తెలుస్తే..చెత్తబుట్టలో వేయరు.!

Health Tips: ఎండాకాలం వచ్చిందంటే రోడ్లపక్కన పుచ్చకాయలు కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. వేసవిలో ఎక్కువగా అమ్ముడవుతాయి. శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు పుచ్చకాయను ఎక్కువగా తింటుంటారు. పుచ్చకాయలో గుజ్జును మాత్రమే తింటాము. తొక్కలను చెత్తబుట్టలో వేస్తాము. అయితే దీని వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? అవేంటోచూద్దాం.

పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగంలో ఉండే పీచు కూడా జీవక్రియకు బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో పుచ్చకాయ తొక్కను చేర్చుకోవచ్చు.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగాన్ని తింటే వైరల్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడవచ్చు. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో పుచ్చకాయ చర్మం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.పుచ్చకాయ తొక్క ఫైబర్ లోపాన్ని కూడా భర్తీ చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయ తొక్కలోని తెల్లని భాగాన్ని తింటే వైరల్ వ్యాధులతో పోరాడవచ్చు.

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు వస్తాయి పుచ్చకాయ తొక్కలో లైకోపీన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముఖంపై వయసు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.పుచ్చకాయను సలాడ్‌గా లేదా జ్యూస్‌గా ఉడికించి పచ్చిగా తినవచ్చు. పుచ్చకాయ తొక్క నుండి హల్వా, చట్నీ తయారు చేయవచ్చు. పుచ్చకాయ తొక్కను చిన్న ముక్కలుగా కోసి పప్పు, టమాటాలతో కలిపి ఉడికించాలి. ఇది అన్నంతో రుచిగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ రూట్లలో నెల రోజులు ట్రాఫిక్ డైవర్షన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు