Harish Rao: ప్రభుత్వ పాఠశాలలో కారం అన్నం.. షాకింగ్ ఫొటో షేర్ చేసిన హరీష్ రావు!

TG: కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కారం అన్నం పెడుతున్నారని అన్నారు హరీష్ రావు. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని డిమాండ్ చేశారు.

New Update
MLA Harish Rao: పవర్‌ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్

Harish Rao: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకుంటున్నారని అన్నారు హరీష్ రావు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం అని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు