Hari Rama Jogayya: చంద్రబాబు చేసింది ఏ మాత్రం కరెక్ట్ కాదు: హరిరామజోగయ్య జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు కేటాయించాల్సిందేనని ఆర్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు మాజీ హోం మంత్రి, జనసేన నేత చేగొండి హరిరామజోగయ్య. టీడీపీ నాయకులు జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. By Jyoshna Sappogula 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Hari Rama Jogayya: కొందరు టీడీపీ నాయకులు కావాలనే జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మాజీ హోం మంత్రి, జనసేన నేత చేగొండి హరిరామజోగయ్య. జనసేనకు (Janasena) 50 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు కేటాయించాల్సిందేనని ఆర్టీవీతో ఎక్స్ క్లూజిక్ మాట్లాడారు. అటు టీడీపీ (TDP) ఇటు జనసేన ఇరు పార్టీ నాయకులు సఖ్యతతో మెలగాలని.. అప్పుడే గెలిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యనించారు. Also Read: ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ వాయిదా.! రెండు పార్టీల్లో ఎక్కడ తేడా కొట్టిన మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని ఉన్నారు. 50 సీట్లలో జనసేనకు బలమైన అభ్యర్థులు వున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు (Chandrababu) పవన్ కళ్యాణ్ ను సంప్రదించకుండా రెండు సీట్లను ప్రకటించడం ఏ మాత్రం బాగాలేదని అన్నారు. రాజానగరం, రాజోలు ఇప్పటికే జనసేన బలంగా వుందని.. ఆ సీట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించడం పెద్ద విషయం కాదని వివరించారు. Also Read: హైకోర్టుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు..! తణుకు, నిడదవోలను పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉంటే బాగుండేదని అన్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుస్తారని ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీసీసీ ఛీఫ్ షర్మిల రెడ్డి గురించి ప్రస్తవించారు. షర్మిల ప్రభావం ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ, జనసేనపై ఉండదని పేర్కొన్నారు. షర్మిల వల్ల రాజకీయంగా జగన్ కు మైనస్ అని వ్యాఖ్యనించారు. షర్మిల గురించి ఎక్కువగా మాట్లాడి ఆమెను పెద్దావిడను చేయటం తనకు ఇష్టం లేదని మాట్లాడారు. #pawan-kalyan #tdp #chandrababu #janasena #hari-rama-jogayya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి