Pawan Kalyan: పవన్‌కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హరిహర వీరమల్లు విడుదల అప్పుడే! పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కొత్త సినిమాల టీజర్స్, పోస్టర్లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు మరో అప్టేడ్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ డేట్ గురించి నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు. By BalaMurali Krishna 04 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కొత్త సినిమాల టీజర్స్, పోస్టర్లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు మరో అప్టేడ్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ డేట్ గురించి నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా `హరి హర వీరమల్లు` నుంచి కొత్త పోస్టర్ని విడుదల అయిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా ఏఎం రత్నం సమర్పణలో రూల్స్ రంజన్ మూవీ తెరకెక్కింది. ఆయన తనయుడు రత్నం కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎం రత్నం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "హరిహర వీరమల్లు..ఇది పీరియాడిక్ మూవీ. చాలా పెద్ద సినిమా. అన్ని సినిమాలకంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా గ్రాఫీక్స్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. పవన్‌కల్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నారు. అందుకే తక్కువ రోజుల్లో అయ్యే సినిమాలు, రిమేక్ మూవీస్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది ఎన్నికల కంటే ముందే ఈ సినిమాని విడుదల చేస్తాం" అని క్లారిటీ ఇచ్చారు. Celebrating the extraordinary bravery, grace, and boundless compassion of our #HariHaraVeeraMallu, @pawankalyan garu, on this exhilarating day! 🎉🔥 #HBDJanaSenaniPawanKalyan 🎂💫 @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs… pic.twitter.com/uqBXh7lx0c — Hari Hara Veera Mallu (@HHVMFilm) September 1, 2023 ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయింది. రెండున్నర సంవత్సరాల క్రితమే ఈ యూవీ గ్లింప్స్ విడుదల చేశారు. అయితే పవన్ రాజకీయాల షెడ్యూల్ వల్ల మూవీ షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. మధ్యలో బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలకు కమిట్ అయ్యారు. ఇది పీరియాడిక్ మూవీ కావడంతో గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండటంతో సినిమా విడుదల లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమా ఆగిపోయేనట్లేననే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌పై నిర్మాత స్పష్టతనివ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి