జ్ఞాన వాపి మసీదులో సర్వేకు ఓకే...మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు..!

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సర్వే ప్రక్రియ మొత్తం నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీలో జరపాలని అధికారులను ఆదేశించింది. ఆ స్థలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదని పేర్కొంది.

author-image
By G Ramu
New Update
జ్ఞాన వాపి మసీదులో సర్వేకు ఓకే...మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు..!

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. శాస్త్రీయ సర్వేపై స్టే విధించాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. శాస్త్రీయ సర్వేపై స్టే విధించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. ప్రస్తుతం ఈ స్టేజీలో న్యాయ స్థానం ఎందుకు జోక్యం చేసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ప్రశ్నించింది.

సర్వే ప్రక్రియ మొత్తం నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీలో జరపాలని అధికారులను ఆదేశించింది. ఆ స్థలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదని పేర్కొంది. ఏఎస్ఐ సంస్థ చరిత్ర మూలాల్లోకి వెళ్లాలని అనుకుంటోందని అంజుమన్ ఇంతేజమియా మజీద్ కమిటీ తెలిపింది. గతం తాలుకు గాయాలను ఏఎస్ఐ మళ్లీ వెళికి తీస్తుందని వాదనలు వినిపించింది.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన సర్వే ద్వారా చరిత్రను తవ్వాలని అనుకుంటోందని మసీదు కమిటీ తరఫున న్యాయవాది హుజెఫా అహ్మదీ అన్నారు. ఏఎస్ఐ చేపట్టిన ఈ సర్వే ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. సోదరభావం, లౌకికవాదానికి భంగం కలిగిస్తోందన్నారు. మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చడాన్ని ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991 నిషేధిస్తోందన్నారు.

ఇక ఏఎస్ఐ తుది నేవిదకను సీల్డ్ కవర్ లో అందించేలా ఆదేశాలు జారీ చేయాలన్న మసీదు కమిటీ అభ్యర్థను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. జ్ఞాన్ వాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న హిందూ దేవతా మూర్తులకు పూజలు చేసేందుకు అనుమతించాలని నలుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మసీదులో వీడియో గ్రఫీ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. దీన్ని యూపీ హైకోర్టులో మసీదు కమిటీ సవాల్ చేసింది. దీంతో అలహాబాద్ కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు