నువ్వు లేని లోకంలో నేను ఉండలేనంటూ.. కెనడాలో హత్యకు గురైన విద్యార్థి.. తల్లి ఆత్మహత్య..!!

కెనడాలో భారతీయ విద్యార్థి గుర్విందర్ నాథ్ జూలై 14న దుండగుల దాడిలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పంజాబ్ కు చెందిన గుర్విందర్ నాథ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తన స్వగ్రామానికి తరలించారు. అప్పటి వరకు తన కొడుకు మరణవార్త ఆ తల్లికి తెలియదు. చివరి నిమిషంలో తెలియడంతో...తట్టుకోలేని ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

author-image
By Bhoomi
New Update
నువ్వు లేని లోకంలో నేను ఉండలేనంటూ.. కెనడాలో హత్యకు గురైన విద్యార్థి.. తల్లి ఆత్మహత్య..!!

ఆ తల్లికి కొడుకు అంటే పిచ్చి ప్రేమ. కొడుకు లేకుంటే బతకలేను అనుకుంది. కొడుకు మరణవార్త తెలియగానే ఆత్మహత్యకు పాల్పడింది. కెనడాలో పంజాబ్ కు చెందిన విద్యార్థి గుర్విందర్ నాథ్ జూలై 14న దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గుర్విందర్ నాథ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం షాహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాకు తీసుకొస్తున్న క్రమంలో కుమారుడు మరణించినట్లు తల్లికి చెప్పారు. దీంతో ఆ తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యింది. నువ్వులేని లోకంలో నేను ఉండలేనంటూ..ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో షాహీద్ భగత్ సింగ్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఈరోజు సాయంత్రం గుర్విందర్ నాథ్ మృతదేహం భారత్ కు రానుంది.

కాగా కెనడాలో ఫుడ్ డెలివరీ పార్టనర్‌గా పని చేస్తున్న విద్యార్థి గుర్విందర్ నాథ్ జూలై9న తెల్లవారుజామున 2.10 గంటలకు పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడికి పాల్పడ్డారు. అతని వాహనాన్ని దొంగలించే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో దుండగులు గుర్విందర్ నాథ్ ను తీవ్రంగా కొట్టారు. దీంతో అతని తల,శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14న మరణించడాడు.

గుర్విందర్ నాథ్ కెనడాలోని ఓ బిజినెస్ స్కూల్లో చివరి సెమిస్టర్ విద్యార్థి. బ్రాంప్టన్ ఏరియాలో నివసిస్తున్నాడు. అతనికి కాలేజీకి సెలవులు అవ్వడంతో పిజ్జా డెలివరీలో పనిచేస్తున్నాడు. జూలై 9న తెల్లవారుజామున పిజ్జా డెలివరీ చేసేందుకు గుర్విందర్ కారులో వెళ్లాడు. కొందరు దుండగులు ఆయన కారును దొంగలించే ప్రయత్నం చేశారు. దీంతో గుర్విందర్ నిరసన తెలపడంతో అతనిపై దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో గుర్విందర్ తీవ్రంగా గాయపడ్డాడు. గుర్విందర్ తలకు తీవ్ర గాయలవ్వడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ట్రామా సెంటర్ లో చికిత్స పొందడంతో…పరిస్థితి విషమించింది. జూలై 14న మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..కుట్రపూరితంగానే ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

శనివారం సాయంత్రం గుర్విందర్ నాథ్ మృతదేహాన్ని పంజాబ్ లోని తన ఇంటికి తరలించారు. ఈరోజు గుర్విందర్ నాథ్ తోపాటు ఆయన తల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు