Guruvinda Ginjalu: ఈ గింజలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే..దెబ్బకి దరిద్రం పరార్‌!

బంగారాన్ని కూడా గురువింద గింజలతో పోల్చారు అంటే..గురువింద గింజలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయని నమ్మేవారు. లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైనవి ఈ గురువింద గింజలు.

New Update
Guruvinda Ginjalu: ఈ గింజలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే..దెబ్బకి దరిద్రం పరార్‌!

గురువింద గింజలు(Guruvindha Ginjalu)...చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎవరి గురించైనా వ్యంగ్యంగా చెప్పాల్సిన సందర్భాల్లో గురువింద గింజను ఉదాహరణగా చూపిస్తారు కూడా. ఇది తీగ జాతికి చెందినది. పైన ఎరుపు..కింద నలుపు రంగుతో కంటికి ఇంపుగా కనిపిస్తాయి. పూర్వం రోజుల్లో ఇవి ఎక్కువగా బంగారం తయారు చేసే వారి దగ్గర ఎక్కువగా కనిపించేవి.

ఎందుకంటే బంగారాన్ని ఈ గింజలతోనే తూచేవారు. అసలు బంగారాన్ని అంటే లక్ష్మీ దేవితో సమానం. అలాంటి బంగారాన్ని కూడా గురువింద గింజలతో పోల్చారు అంటే..గురువింద గింజలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయని నమ్మేవారు. లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైనవి ఈ గురువింద గింజలు.

Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో నవదీప్ కు ఈడీ నోటీసులు

కాలం మారుతున్న కొద్ది గురువింద గింజలు కూడా కనుమరుగు అయ్యాయనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజుల్లో వీటి గురించి చాలా మందికి తెలియదు. కానీ వీటిని ఔషధాలు గా కూడా ఉపయోగించేవారు. ముఖ్యంగా ఆయుర్వేదం. ఆయుర్వేదంలో వీటి గురించి నిపుణులు ప్రస్తావించారు. కొన్ని రకాల మానసిక జబ్బులు పొగొట్టాడానికి వీటిని ఉపయోగిస్తుంటారు.

ఈ గురువింద గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలవడం వల్ల ప్రత్యేక సందర్భాల్లో అంటే దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగ సమయాల్లో వీటిని ప్రత్యేకంగా పూజించి ఎరుపు బట్టలో కుంకుమతో కలిపి బీరువాలో కానీ, వ్యాపారం చేసే చోట గల్లా పెట్టేలో కానీ పెట్టుకుంటే ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు.

అంతేకాకుండా గురువింద గింజలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల నరదృష్టి, చెడు ప్రభావాలు తొలగిపోతాయని తెలుస్తోంది. గ్రహా దోషాలు ఉన్న వారు తమ ఒంటి మీద ధరించే ఆభరణాల్లో వీటిని చేర్చుకోవడం వల్ల దోషాలు తొలగించే గుణాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

గురువింద గింజలను గాజుల్లోను, పట్టీల్లోను పెట్టించుకునేవారు గతంలో. అలాగే చంటిపిల్లలకు చెడు దృష్టి తగలకుండా కూడా ఉపయోగించేవారు. మెలతాడులోను..మెడలోను కట్టేవారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు