YCP: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..! గుంటూరులో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి EX MLA Maddali Giri: ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసింది. దీంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు (YS Jagan) రాజీనామా లేఖ పంపారు. తాను వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా, 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. అయితే, ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మద్దాలి గిరి తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన తిరిగి టీడీపీలో చేరుతారా? లేదంటే జనసేన పార్టీ కాని బీజేపీలో కాని చేరుతారా? అనేది తెలియాల్సి ఉంది. Also Read: జగన్ హత్యా రాజకీయాలు చేశారు.. అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి ?: షర్మిల #ycp #ys-jagan #ap-politics #maddali-giri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి