త్వరలోనే "గన్..గన్" గణేశా రిలీజ్ డేట్.!

గం..గం..గణేశా అనేది అందరికీ తెలిసిందే. ఆనంద్ దేవరకొండ సినిమా పేరు కూడా ఇదే. కాకపోతే ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమాను "గన్..గన్" గణేశా అని చెప్పుకోవాలేమో. ఊహించని విధంగా తుపాకులు పట్టుకొని రెడీ అయ్యాడు ఆనంద్ దేవరకొండ.

New Update
త్వరలోనే "గన్..గన్" గణేశా రిలీజ్ డేట్.!

గం..గం..గణేశా అనేది అందరికీ తెలిసిందే. ఆనంద్ దేవరకొండ సినిమా పేరు కూడా ఇదే. కాకపోతే ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమాను "గన్..గన్" గణేశా అని చెప్పుకోవాలేమో. ఊహించని విధంగా తుపాకులు పట్టుకొని రెడీ అయ్యాడు ఆనంద్ దేవరకొండ.

"బేబీ" సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం "గం..గం..గణేశా" అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నాడు.

"గం..గం..గణేశా" సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న"గం..గం..గణేశా" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్ లో రెండు రైఫిల్స్ పట్టుకొని, నవ్వుతూ కనిపిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ - ఫన్ - గన్ అనే క్యాప్షన్ రాసి ఉంది.

మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం "గం..గం..గణేశా" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

హీరో విజయ్ తో ఫొటో తీసుకునేటప్పుడు ఓ విద్యార్థిని  చేసిన పని అందరినీ షాక్ కి గురిచేసింది. ఫొటో తీస్తున్న సమయంలో విజయ్ విద్యార్థిని భుజం పై చేయగా.. ఆమె చేతిని తీసేసింది. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
viral video_ student removed hero vijay hand from shoulder

viral video_ student removed hero vijay hand from shoulder

Thalapathy Vijay:  సౌత్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతడు ఎక్కడైనా కనిపిస్తే ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని తహతహలాడుతారు అభిమానులు. అలాంటిది  విజయ్ తో ఫొటో తీసుకునేటప్పుడు ఓ విద్యార్థిని  చేసిన పని అందరినీ షాక్ కి గురిచేసింది. ఫొటో తీస్తున్న సమయంలో విజయ్ విద్యార్థిని భుజం పై చేయగా.. ఆమె చేతిని తీసేసింది. 

Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

అసలేం జరిగిందంటే 

 అయితే  'తమిళ వెట్రి కజగం' పార్టీ చెన్నైలో నిర్వహించిన వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి హీరో విజయ్ ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. 10, 12వ తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ కార్యక్రమంలో  సత్కరించారు. ఈ క్రమంలో విజయ్ స్టేజ్ పై ఇద్దరు విద్యార్థినులకు బహుమతులు అందజేసి వారితో కలిసి ఫొటో దిగారు. అయితే ఫొటో దిగుతున్న సమయంలో విజయ్  విద్యార్థి భుజంపై చేయి వేయగా.. ఆమె అతడి  చేయిని తీసేసింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ అభిమానులు తీవ్ర కలత చెందారు. కొందరు ఆవిద్యార్థిని తీరుపై మండిపడ్డారు కూడా..  కానీ, ఆ తర్వాత వచ్చిన ఫుల్ వీడియోతో అసలు విషయం తెలిసింది.  విజయ్ చేయి పట్టుకొని ఫొటో దిగడం కోసం భుజం పై నుంచి తీసేసింది ఆ విద్యార్థిని. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

latest-news | cinema-news | thalapathy-vijay 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

Advertisment
Advertisment
Advertisment