Gudla valleru: చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా ఉంది: పూనమ్ కౌర్

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన తననెంతో మానసిక వేదనకు గురిచేసిందంటూ నటి పూనమ్ కౌర్ పోస్ట్ పెట్టింది. చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

New Update
Gudla valleru: చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా ఉంది: పూనమ్ కౌర్

Gudla valleru: కృష్ణజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల ఘటనపై నటి పూనమ్ కౌర్ ఎమోషనల్‌గా రియాక్ట్ అయింది. ఈ ఘటన తననెంతో బాధించిందని, నేరస్థులను కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రియమైన అమ్మాయిలకు మీలో ఒక అమ్మాయిగా ఈ లేఖ రాస్తున్నా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, నమ్మకంతో బయటకు పంపుతున్నారు. బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడ్డాను. మీరందరూ బయట ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఒక శక్తిగా ఉండటం కంటే బలమైనది మరొకటి లేదని చెప్పారు.

చట్టం బలహీనులకు దూరంగా ఉంది..
ఇక చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా వర్తించబడుతుంది. అనేది కోట్ మన దేశంలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలతో నాకు ఈ కొటేషన్ గుర్తుకు వస్తుంది. నేరస్థులు ఎలా రక్షించబడతారు.. బాధితులకు జరుగుతున్న అన్యాయం వంటి అనేక అనుభవాలతో మానసికంగా నేను అలసిపోయాను. కాలేజీలు డిగ్రీ సర్టిఫికెట్లను రద్దు చేసి ఇతరులను దెబ్బతీసే పద్ధతులను అవలంబించే స్టూడెంట్స్ ను బయటకు పంపిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు.

నాకు అసహ్యం కలిగిస్తుంది..
వ్యక్తులు ఎంత శక్తివంతమైన వారైనా, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు బహిర్గతం చేస్తారని నిర్ధారించుకోండి. ఈ సందర్భంగా రెజ్లర్స్ నిరసనను గుర్తు చేయగలను. ఇక్కడ అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలా మంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చాలా మంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం నాకు అసహ్యం కలిగిస్తుంది. నేరస్తులకు ఎంతటి శక్తిమంతులైనా వారికి సహకరిస్తున్నా, ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. సలహాలు ఇవ్వడం సులువు కానీ దాన్ని అమలు చేయడం కష్టం అది నాకు తెలుసు. ఈ మాటలు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుంది. ప్రేమ అభినందనలతో మీ పూనమ్ కౌర్. ‘మీరు చూడాలనుకుంటున్న మార్పు కోసం పోరాడండి‘ అంటూ గాంధీ కొటేషన్ జతచేసింది.

#poonam-kaur #gudlavalleru-engineering-college
Advertisment
Advertisment
తాజా కథనాలు