Gudivada Amarnath: పోరంబోకు స్థలంలో నిర్మించారు.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్..! టీడీపీ నేతలు దమనకాండ, దాడులు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ అన్నారని అయితే, కూటమి ప్రభుత్వం అంతవరకు కూడా ఆగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 22 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Gudivada Amarnath: తెలుగుదేశం పార్టీ నేతలు దమనకాండ, దాడులు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అహంకారంతో మాట్లాడుతున్న విషయాలు చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్..! తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం (Tadepalli YCP Office) ఏ విధంగా నేలమట్టం చేశారో చూశామన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్మోహన్ రెడ్డి అన్నారని అయితే అంతవరకు కూడా వీరు ఆగట్లేదని అన్నారు. వాగు పోరంబోకు స్థలంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయం నిర్మించారని.. గతంలో టీడీపీ కూడా అనేక చోట్ల ప్రభుత్వ భూములు పార్టీ కార్యాలయాలకు కేటాయించారన్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో ప్రకారం తాము కూడా ఈ స్థలాలు కేటాయింపు చేశామన్నారు. తాము చట్ట పరంగా పోరాటం చేస్తామని..ప్రభుత్వం నుంచి కేటాయించబడిన.. ఈ రోజు బుల్డోజర్ల ప్రభుత్వం విధ్వంసకాండ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం రోజు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు చంద్రబాబు, లోకేష్ కు కనిపిస్తుందని అందుకే ఉద్దేశంతోనే కొట్టేశారని ఫైర్ అయ్యారు. #gudivada-amarnath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి