FM Stations:తెలంగాణలో 31 కొత్త ఎఫ్‌ఎం స్టేషన్లకు పచ్చ జెండా!

ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడంతో పాటు ఉపాధికల్పన పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల మూడో దశలో దేశ వ్యాప్తంగా 34 నగరాల్లో 730 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు 31 స్టేషన్లు రానున్నాయి.

New Update
FM Stations:తెలంగాణలో 31 కొత్త ఎఫ్‌ఎం స్టేషన్లకు పచ్చ జెండా!

FM Stations: ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహాన్ని అందించడంతోపాటుగా, ఉపాధికల్పన పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 234 నగరాల్లో 730 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో తెలంగాణ నుంచి 31 స్టేషన్లకు అవకాశం దక్కింది.

బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. ఈ మూడోదశ ప్రాజెక్టునకు ఆమోదముద్ర పడింది.

తెలంగాణలో.. ఆదిలాబాద్ తో పాటు కొత్తగూడెం వంటి వెనుకబడిన జిల్లాలతో పాటుగా.. కరీంనగర్, ఖమ్మం, రామగుండం, సూర్యాపేట,మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండ జిల్లాలకు మూడు రేడియో ఛానల్స్‌ ను ఇవ్వనుండగా.. నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా 4 ఛానల్స్ ను అధికారులు కేటాయించారు.

ఇలాంటి ఛానల్స్ ను ఏర్పాటు చేయడం వల్ల.. ప్రాంతీయ భాషలు, స్థానిక యాస భాషల్లో సృజనాత్మకమైన కంటెంట్‌ను ప్రజల ముందుకు తీసుకుని వచ్చేందుకు వీలుంటుంది. దీంతోపాటుగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయి వరకు చేర్చేందుకు వీలు కలుగుతుంది.

Also Read: తెలుగు జాతి తియ్యదనం…తెలుగు భాష గొప్పదనం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు