Crime News: ఖమ్మంలో అమానుషం.. ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మపై మనవడు అఘాయిత్యం!

ఖమ్మం జిల్లా ఇందిరానగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పింఛన్ డబ్బులు ఇవ్వడంలేదని అమ్మమ్మ రాంబాయిను దారుణంగా హత్య చేశాడు మనవడు ఉదయ్. రాంబాయి శరీరంపై గాయాలు కనిపించడంతో ఉదయ్ ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Khammam: పింఛన్ డబ్బులు ఇవ్వడంలేదని అమ్మమ్మను దారుణంగా హత్య చేశాడు ఓ మనవడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఇందిరానగర్ లో చోటుచేసుకుంది. ఇందిరానగర్ లోని ఎనభై ఏళ్ల వృద్ధురాలు అమరబోయిన రాంబాయి ఒంటరిగా నివసిస్తోంది. ఒంటరిగా ఉంటున్న తన మనవడు గడ్డం ఉదయ్ ఆలనాపాలనా కోసం రాంబాయి అందరిని వదిలి ఇందిరానగర్ లోనే నివాసం ఉంటోంది. అయితే, మనవడు గడ్డం ఉదయ్ దురలవాట్లకు బానిసై డబ్బుల కోసం తరచూ రాంబాయిని వేధించేవాడని తెలుస్తోంది.

Also Read: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..!

నిన్న రాత్రి సమయంలో వృద్ధురాలు రాంబాయి ఇంటికి వచ్చిన మనవడు గడ్డం ఉదయ్.. పింఛన్ డబ్బులు ఇవ్వాలని రాంబాయిని వేధింపులకు గురిచేశాడు. అయితే, తెల్లవారుజామున అనారోగ్యంతో అమ్మమ్మ చనిపోయిందంటూ స్థానికులను పిలిచాడు మనవడు గడ్డం ఉదయ్. మంచంలో ఒంటినిండా తీవ్రగాయాలతో పడిఉన్న రాంబాయి మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయిన స్థానికులు ఉదయ్ ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. రాంబాయి శరీరంపై మెడ, నడుము, ఛాతీ భాగంలో గాయాలు కనిపించడంతో మనవడు ఉదయ్ రాంబాయిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

Also Read: అంగన్‌వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌..!

వృద్ధురాలు రాంబాయి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఖమ్మం టూటౌన్ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం రాంబాయి మృతదేహం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితుడు గడ్డం ఉదయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇందిరానగర్ కాలనీ వాసులు గడ్డం ఉదయ్ ను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులతోనూ గతంలో ఉదయ్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఉదయ్ ప్రవర్తనా తీరుపై కాలనీవాసులు ఆరోపణలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు