ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ టీజర్ రిలీజ్‌ చేసిన త్రివిక్రమ్

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143' టీజర్‌ను రిలీజ్ చేశారు స్టార్ డైరెక్టర్‌ త్రివిక్రమ్. ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవడంతో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మూవీ మేకర్స్.

New Update
ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ టీజర్ రిలీజ్‌ చేసిన త్రివిక్రమ్

Govt Junior College Punganur movie: యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ తరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143' టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమాలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.

Also Read: మెగాస్టార్ కు విలన్ గా రానా?

ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా శుభాకంక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ టీజర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చెయ్యడం జరిగింది. ఈ క్రమంలో మేకర్స్ మాట్లాడుతూ ఆయన టీజర్ చూసి చాలా బాగుందన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ అండ్ సినిమా ఫ్రేమింగ్ చాల బాగుందన్నారు. కొత్త వారితో చేసినా యాక్టింగ్ మెచూరిటీగా సహజంగా ఉందన్నారు.

publive-image

అంతేకాకుండా టీనేజ్ లవ్ స్టోరీ లో ఉండాల్సిన ఇన్నోసెన్సీ ఇందులే కన్పిస్తుందన్నారు. ఈ సినిమా కచ్చితంగా యువతకి నచ్చుతుందని టీం అందరికి బెస్ట్ విషెస్ తెలియజేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేసారు అని వెల్లడించారు. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ గారు లిరిక్స్ అందించారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్ కోదాటి పవన్ కళ్యాణ్ కాగా వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు