NEET 2024 : ఆగస్టు మధ్యలో నీట్‌ పీజీ పరీక్ష?

వాయిదా పడ్డ నీట్‌–పీజీ పరీక్షను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అలాగే.. ఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా ఎగ్జామ్‌ నిర్వహించడానికి రెండు గంటల ముందు రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

New Update
NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు

NEET Exam In August Mid : ఆగస్టు మధ్యలో వాయిదా పడ్డ నీట్‌–పీజీ పరీక్ష (NEET-PG Exam) ను నిర్వహించాలని ఎన్టీయే (NTA) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లీక్ కారణంగా పరీక్షా వాయిదా పడడంతో మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా ఎగ్జామ్‌ నిర్వహించడానికి రెండు గంటల ముందు రూపొందించాలని ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీక్‌ అయిన నేపథ్యంలో.. జూన్‌ 23న జరగాల్సిన నీట్‌–పీజీ పరీక్షను ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణ సిద్దమైన ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ (NBEMS) తో చర్చించి.. పరీక్ష ఎప్పుడు నిర్వహించేదీ ప్రకటిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది.

Also Read : ఈరోజు ఢిల్లీకి చంద్రబాబు.. రేపు మోదీతో కీలక భేటీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు