‘అయితే కొట్టండి.. లేదంటే చావండి’: గోరక్షక్ దళ్

కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హర్యానాలో మళ్లీ విద్వేష ప్రసంగాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. నూహ్ అల్లర్లు తర్వాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు సున్నితంగా మారిపోయాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలుచేస్తున్నారు.

New Update
‘అయితే కొట్టండి.. లేదంటే చావండి’: గోరక్షక్ దళ్

Haryana: నుహ్ అల్లర్లు హర్యానా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మళ్లీ విద్వేష ప్రసంగాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. షరతులతో కూడిన పోలీసుల అనుమితితో నిర్వహించిన గోరక్షక్ దళ్ సభలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ సంఘ నాయకుడు ఆచార్య ఆజాద్ శాస్త్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. తమకు 100 లైసెన్స్ ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విశ్వహిందూ పరిషత్‌కు చెందిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన సన్నాహాలను చర్చించేందుకు ఈ మహాపంచాయత్‌ నిర్వహించారు. జూలై 31న నిర్వహించాల్సిన ఈ యాత్రకు నుహ్‌లో హింసాత్మక ఘర్షణల కారణంగా అంతరాయం కలిగింది. తాజాగా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. సభలో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ లోకేంద్ర సింగ్ హెచ్చరించారు. అయినా కానీ కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రసంగాలు చేశారు.

ఆచార్య ఆజాద్ శాస్త్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి అయితే కొట్టండి, లేదంటే చావండి అన్నట్లుగానే ఉందన్నారు. మేవాత్‌లో 100 ఆయుధాల లైసెన్స్ పొందాలని సూచించారు. తుపాకులు కాకుండా రైఫిల్స్ తీసుకోవాలని.. రైఫిల్స్ అయితే ఎక్కువ దూరం కాల్చడానికి వీలు అవుతుందని తెలిపారు. ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం అని వ్యాఖ్యానించారు. హిందూ దేశమైన భారతదేశంలో గాంధీ వల్లనే ఈ ముస్లింలు మేవాత్‌లో ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల కేసులకు భయపడాల్సిన పని లేదని యువకులను రెచ్చగొట్టడం వివాదస్పదమవుతోంది.

అసలేం జరిగిదంటే?

నుహ్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు హోం గార్డులు చనిపోయారు. ఓ వర్గం నిర్వహించిన యాత్రను వేరొక వర్గానికి చెందిన యువత అడ్డుకోవడం వల్ల ఘర్షణలు తలెత్తాయి. ఓ సంస్థ కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ అల్లర్లకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఊరేగింపులో పాల్గొన్న వాహనాలకు అల్లరి మూకలు నిప్పంటించాయి. మరి కొంతమంది యువకులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

భారత రాజ్యాంగానికి మించిన వారేవరూ లేరని.. రాష్ట సమగ్రత, శాంతి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ హెచ్చరించారు. ప్రజలంతా సోదర భావాన్ని కలిగి ఉండాలని, శాంతి కోసం కృషి చేయాలని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు