AP: నా ఆశ్రమాన్ని నాకు ఇప్పించండి.. గోపాలకృష్ణ స్వామి మౌన నిరాహార దక్ష..! నెల్లూరు జిల్లాలో ముమ్మడి గోపాలకృష్ణ స్వామి ఆమరణ మౌన నిరాహార దీక్ష చేపట్టారు. హిమాలయ పర్వతాలకు వెళ్లే క్రమంలో 10 సంవత్సరాలుగా తన బంధువైన గోదల మహేంద్రకు ఆశ్రమ బాధ్యతలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు తన ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Nellore: తన ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలంటూ ముమ్మడి గోపాలకృష్ణ స్వామి నెల్లూరు జిల్లాలో స్థానిక శివాలయం సెంటర్ లో ఆమరణ మౌన నిరాహార దక్ష చేపట్టారు. హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు వెళ్లే క్రమంలో ఆశ్రమాన్ని స్వామి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 10 సంవత్సరాలుగా తన బంధువైన గోదల మహేంద్రకు ఆశ్రమ బాధ్యతలు ఇచ్చారు. అయితే, పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి ఆశ్రమానికి చేరుకున్న గోపాలకృష్ణ స్వామి.. ఆశ్రమానికి వచ్చేటువంటి మూలధనాన్ని గోదల మహేంద్ర సొంత ఖర్చులకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గంలో ఉన్నటువంటి విలువైన ఆస్తి కోసమే ఆశ్రమాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు భక్తులు సైతం వాపోతున్నారు. Also Read: ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..! #nellore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి