Viral Video: డ్రైవర్ లేకుండా 80 కి.మీ దూసుకెళ్లిన ట్రైన్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పఠాన్‌కోట్ వైపు దూసుకెళ్లింది. డ్రైవర్‌ టీ తాగుదామని కిందకు దిగిన తర్వాత ఈ ఘటన జరిగింది. అతను హ్యాండ్‌ బ్రేక్‌ వెయ్యకుండా కిందకు దిగినట్టు సమాచారం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Viral Video: డ్రైవర్ లేకుండా 80 కి.మీ దూసుకెళ్లిన ట్రైన్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

No driver runaway goods train travels 84 km:  'టీ' తాగుదామని లోకోపైలట్‌ కిందకు దిగాడు... అతనితో పాటే కో-డ్రైవర్‌ కూడా దిగాడు. అది గూడ్స్‌ ట్రైన్‌. ప్రయాణికులు ఉండరు. అయితే ఇలా టీ తాగుదమని కిందకు దిగారో లేదో.. ట్రైన్ అలా కదలడం మొదలుపెట్టింది. ట్రైన్ ఆపింది ఓ స్లోప్‌(slope) ట్రాక్‌పై కావడంతో అది ముందుకు వెళ్లింది. ఇక్కడ డ్రైవర్‌ నిర్లక్ష్యం కూడా ఉంది. హ్యాండ్‌ బ్రేక్ వెయ్యకుండా అతను కిందకు దిగాడు. ఇంకేముంది... అలా కదిలిన ట్రైన్ కాసేపటికి వేగం పెంచుకుంది. గంటకు 100కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.. మరి తర్వాత ఏం జరిగింది?

కథువా నుంచి పఠాన్‌కోట్‌కు వెళ్లే గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా 80 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌పై అత్యంత వేగంతో నడిచింది. పంజాబ్‌-ముకేరియన్‌లోని దాసుహా సమీపంలో రైల్వేశాఖ ఈ ట్రైన్‌ను అతికష్టంమీద నిలిపివేసినట్లు సమాచారం. ప్యాసింజర్ రైళ్ల డ్రైవర్లు, ఉద్యోగులు రైలును నిలిపివేశారు. అప్పటికి రైలు 84 కిలోమీటర్లు ప్రయాణించింది. ముందు ట్రాక్‌పై మరో రైలు రాలేదు. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఆదివారం ఉదయం 7:10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. డ్రైవర్ జమ్మూలోని కథువాలో గూడ్స్ రైలు నంబర్ 14806R ఆపాడు. ఇక్కడ డ్రైవర్ రైలు దిగి టీ తాగడానికి వెళ్లాడు. ఇంతలో రైలు ఒక్కసారిగా కదలడం ప్రారంభించి వేగం పుంజుకుని పరుగు ప్రారంభించింది. ఇక గూడ్స్ రైలులో కాంక్రీట్‌ తీసుకెళ్తున్నట్లు కథువా రైల్వే స్టేషన్‌కు సమీప వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంక్రీటు కథువా నుంచి లోడ్ చేశారు.

Also Read: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు!

WATCH THIS INTERESTING VIDEO: #Nani32 - Announcement Video

Advertisment
Advertisment
తాజా కథనాలు