Asian Games 2023 Day 1 : రజతంతో భారత్ శుభారంభం..ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు..!!

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆగటగాళ్లు శుభారంభం చేశారు. తొలిరోజే షూటింగ్, రోయింగ్ విభాగాల్లో భారత్ ఖాతాల్లోకి మూడు పతకాలు వచ్చి చేరాయి.

New Update
Asian Games 2023 Day 1 :  రజతంతో భారత్ శుభారంభం..ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు..!!

ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. చైనాలోని హాంగ్ జౌ ఒలింపిక్స్ స్పోర్ట్స్ కేంద్రం ప్రారంభమైన ఈ క్రీడల్లో నేడు ఆరంభంలోనే భారత్ ఖాతాలో మూడు పతాకాలు చేరాయి. మొదటి ఈవెంట్ లోనే పతకాన్ని సాధించి గొప్ప ఆరంభాన్ని అందించారు. భారత షూటర్లు పది మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత, మెహులి ఘోష్, అశి చౌక్సే అద్భుత ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించారు. గ్రూప్ విభాగంలో మెడల్ సాధించడంతోపాటు రమిత, మెహులి వ్యక్తి విభాగంలో ఫైనల్ చేరుకున్నారు.

ఇక భారత ఆర్మీకి చెందిన అర్జున్ లాల్ జాట్, అర్వింద్ కలిసి పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్ విభాగంలో సిల్వర్ సాధించారు. రోయింగ్ విభాగంలోనే బాబులాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడి కాంస్యం సాధించింది. 8మందితో కూడిన టీమ్ మరో సిల్వర్ కూడా భారత్ ఖాతాలో చేరింది. ఇక మరికొన్నింటిలోనూ వేట కొనసాగుతోంది. ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. భారత మహిళ క్రికెట్ జట్టు సేమీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను మట్టికరిపించింది. ఫైనల్ కు చేరుకుంది. మరిన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు తలపడాల్సి ఉండగా...రోయింగ్ లో మరికొన్ని పతకాలు దక్కే అవకాశం ఉంది.

అటు భారత్ ఉజ్బెకిస్థాన్‌తో తలపడుతోంది. ఇది గ్రూప్ స్టేజ్ మ్యాచ్. ప్రస్తుతం ఇరు జట్లు మైదానంలో ఉన్నాయి. తొలి క్వార్టర్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా గోల్ చేయలేదు. ఆసియా క్రీడల సెమీ ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 17.5 ఓవర్లలో 51 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇప్పుడు విజయానికి 20 ఓవర్లలో 52 పరుగులు చేయాలి.పురుషుల డబుల్ ఈవెంట్ రోయింగ్‌లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ భారత్‌కు రజత పతకాన్ని అందించారు. ఇద్దరూ 06 నిమిషాల 28 సెకన్లలో ముగించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు