Shirdi: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ట్రస్ట్‌ బోర్డు!

షిర్డీ ఆలయానికి భక్తులు విరాళాలు, కానుకల రూపంలో ఇచ్చిన బంగారు, వెండి వస్తువులను కరిగించి నాణేలు, పతకాల రూపంలో భక్తులకు అందించాలని షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

New Update
Shirdi: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ట్రస్ట్‌ బోర్డు!

షిర్డీ సాయిబాబా భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో బాబాని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం షిర్డీ సాయిబాబా టెంపుల్‌ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబాకి కానుకల రూపంలో వచ్చే బంగారు, వెండి ఆభరణాలను కానీ, నిల్వలను కరిగించి భక్తులకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.

అయితే దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో షిర్డీ సాయినాథుని ఆలయం ఒకటి. షిర్డీ బాబాకు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ వ్యాప్తంగా కాకుండా...విదేశాల నుంచి సైతం వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే షిర్డీ సాయికి భారీగా విరాళాలు ఇస్తుంటారు. కొంతమంది భక్తులు నగదుతో పాటు వస్తువులు, బంగారం, వెండి రూపంలో కానుకలను అందజేస్తుంటారు. ఇలా భక్తులు సమర్పించిన కానుకల్లో 450 కిలోలు బంగారం, 6 వేల కిలోల వరకు వెండి ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉంది.

ఈ క్రమంలోనే దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు బంగారం, వెండిని కరిగించి పతకాలు, నాణేలను తయారు చేసి వాటిని అమ్మలనకుంటున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం గురించి తుల్జాపూర్‌ భవానీ దేవస్థానం కూడా పరిశీలిచి..సభ్యులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ..ఆలయానికి వచ్చిన కానుకల్లో 450 కిలోల బంగారం, 6 వేల వరకు వెండి ఉందని తెలిపారు.

దీనిలోనుంచి 155 కిలోల బంగారం, 6 వేల కిలోల వెండిన కరిగించి...5, 10 గ్రాముల నాణెలు, పతకాలను తయారు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దీని కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు సభ్యులు వివరించారు. అనుమతులు వచ్చిన వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు.

Also read: ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నా..కానీ బోర్‌ కొట్టలేదంటున్న నటి!

Advertisment
Advertisment
తాజా కథనాలు