Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‎న్యూస్...ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే అంగన్ వాడీల్లో 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి సంగతి తెలిసిందే. దీంతో వీటిల్లో సుమారు 8వేల వరకు అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

New Update
Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‎న్యూస్...ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!

Anganwadi Jobs 2023 Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అతి త్వరలోనే ప్రభుత్వం భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 3వేలకు పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా మరో 8వేల ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 140 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31,711కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉండగా...3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!!

అయితే ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక హెల్పర్ ఉంటే...మినీ కేంద్రాల్లో ఒకే టీచర్ ఉంటారు. హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడంతో అక్కడ హెల్పర్ పోస్టులు అనివార్యమయ్యాయి. రాష్ట్రప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖకు అప్ గ్రేడ్ వివరాలను పంపించింది. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతోపాటు వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుది. కేంద్రం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం కూడా చేపట్టే ఛాన్స్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఎల్ఐసీ నుంచి రూ.30 వేల స్కాలర్షిప్.. దరఖాస్తు ఇలా..!!

అటు రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఈమధ్యే ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో రెండున్న వేల మంది టీచర్లు రిటైర్డ్ కావాల్సి ఉంది. ఈ క్రమలో అన్ని రకాల్లో కలిపి 4వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. దీని ద్వారా భర్తీ ప్రారంభించింది. అయితే చాలా కారణాలతో భర్తీ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే కొత్తగా 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  గ్రూప్-1పై టీఎస్పీఎస్సీకి బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు.. మళ్లీ పరీక్ష!

Advertisment
Advertisment
తాజా కథనాలు