Holidays : విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. మార్చిలో 11 రోజులు సెలవులు!

మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ముందు మార్చి 3 న ఆదివారంతో సెలవు మొదలుకుని... వచ్చే వారంలో మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి.ఇలా మొత్తంగా 11 రోజులు మార్చి నెలలో ఉన్నాయి.

New Update
Holidays : తల్లిదండ్రులు, అత్తామామలతో గడిపేందుకు వారికి సెలవులు!

Good News For Students : సెలవు(Holidays) అనే మాట వింటే చాలు విద్యార్థులకు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. వీపునకు తగిలించుకునే వందల కేజీల బరువును ఒక్క రోజైనా పక్కన పెట్టొచ్చని ఆనందపడుతుంటారు. ఈ ఏడాదిలో జనవరి నెలలో విద్యార్థులకు, ఉద్యోగుల(Employees) కు భారీ స్థాయిలో సెలవులు వచ్చాయి.

గత నెల ఫిబ్రవరి నెలలో తెలంగాణ(Telangana) లోని కొన్ని జిల్లాలకు మాత్రమే మేడారం జాతర(Medaram Jatara) సందర్భంగా ఓ ఐదు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. ఇలా ఫిబ్రవరిలో ఆదివారాలు కూడా కలుపుకుని తక్కువ మొత్తంలోనే సెలవులు వచ్చాయి.

ఇదిలా ఉంటే మార్చి నెలలో(March) విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ముందు మార్చి 3 న ఆదివారంతో సెలవు మొదలుకుని... వచ్చే వారంలో మహాశివరాత్రి(Maha Shivaratri), రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి.

ఆ తరువాత మార్చి 17, 24 ఆదివారాలు రాగా మార్చి 25 సోమవారం హోలీ(Holi) పండగ సందర్భంగా సెలవు. అలాగే మార్చి 29న గుడ్‌ ఫ్రైడే(Good Friday)... రాగా మార్చి 31 ఆదివారం సెలవు ఇలా మొత్తంగా 11 రోజులు మార్చి నెలలో ఉన్నాయి.

Also Read : చిన్నారుల్లో పెరుగుతున్న స్కార్లెట్‌ ఫీవర్‌.. నిర్లక్ష్యం చేయవద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు