Medical Council : ఆ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ అదిరిపోయే శుభవార్త!

2020-21 విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ తీసుకుని, పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఎంబిబిఎస్ విద్యార్థులు మరో ఛాన్స్ ఇస్తూ జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం తీసుకుంది.

New Update
Medical Council : ఆ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ అదిరిపోయే శుభవార్త!

National Medical Commission : దేశంలోని వైద్యకళాశాల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఎంబిబిఎస్ అడ్మిషన్ తీసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్(NMC) గుడ్ న్యూస్ చెప్పింది. 2020-21 ఎంబిబిఎస్(MBBS) ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు మరో ప్రయత్నానికి ఛాన్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డిసెంబర్ 11న ఎన్ఎంసీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో వైద్య కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకుని తమ మొదటి ప్రొఫెషనల్ ఎంబిబిస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిలేని విద్యార్థులను మాత్రమే మరో ప్రయత్నానికి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ బ్యాచ్ పై కొవిడ్ ప్రభావం పడటంతో వారికి మాత్రమే అదనపు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇది లాస్ట్ ఛాన్స్ అని ఇకపై ఇలాంటి అవకాశాలు ఉండవని ఎన్ఎంసీ తేల్చి చెప్పింది.

నేరుగా విదేశాల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు:
భారత్ లో వైద్య విద్య అభ్యసించినవారు నేరుగా అమెరికా,కెనడా,స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో వైద్య సేవలు అందించేందుకు మార్గం మరింత సులభం అయ్యింది. భారత్ లో వైద్య విద్యను నియంత్రించే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించింది. దీంతో ఎన్ఎంసీ గుర్తింపు ఉన్న భారత్ లోని 706 మెడికల్ కాలేజీలకు కూడా ఆటోమెటిక్ గా WFME గుర్తింపు లభిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఎన్ఎంసీ గుర్తింపు ఉణ్న విద్యాసంస్థల్లో ఎంబిబిఎస్ చదివినవారు విదేశాల్లో నేరుగా ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. విదేశాల్లో మెడికల్ పీజీ కోర్సులు చదవడానికి కూడాఎలాంటిసమస్యలు ఉండవు.

ఇక ఐదేళ్లలోనే బీటెక్, ఎంటెక్.. జేఎన్టీయూ కీలక నిర్ణయం..!!

ఇంటర్ పూర్తవ్వగానే బీటెక్ చేసి అమెరికాలో ఎంఎస్ చేయలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటిగ్రేటెడ్ డ్యయల్ డిగ్రీకోర్సు పేరుతో జేఎన్టీయూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఓ సరికొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలోనే బీటెక్, ఎంఎస్ పూర్తి చేసుకోవచ్చు. అది కూడా అమెరికాలో చదువు కంప్లీట్ చేసి పట్టా పొందవచ్చు. సాధారణంగా బీటెక్ చేసి ఎంఎష్ చేసేందుకు కనీసం 6 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఐదు సంవత్సరాల్లోనే పూర్తయ్యే డ్యుయల్ డిగ్రీ కోర్సులో భాగంగా విద్యార్థులు 3ఏళ్లు జేఎన్టీయులో, రెండేళ్లు అమెరికాలో చదువుకోవల్సి ఉంటుంది. దీనికోసం అమెరికాలోని స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ అలబామా, మిల్వాకీ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, లారెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటి యూనివర్సిటీలతో జెఎన్టీయూ ఇప్పటికే అవగాహన ఒప్పందం చేసుకుంది. 

కంపూటర్స్‌, ఏరోస్పేస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆటోమోటివ్‌, ఎలక్ట్రికల్‌, ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, మెకట్రానిక్స్‌, రోబోటిక్స్‌ వంటి కోర్సుల్లో ఈ వర్సిటీల్లో మాస్టర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫీజుల్లో రాయితీలు కూడా లభిస్తాయి. అమెరికా యూనివర్సిటీల్లో పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా ఉంటుంది. డ్యూయల్ డిగ్రీతో విద్యార్థులకు సమయంతోపాటు డబ్బు ఆదా అవుతుందని జేఎన్టీయూ అధికారులు చెబుతున్నారు.

ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఎంటెక్ లో ప్రవేశాలు కల్పించే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని కాలేజీలు. రాష్ట్రంలోని కొన్ని పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు కోర్సులకు ప్రవేశపరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 6 పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో కొన్ని పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. అందులో టెక్స్ టైల్ టెక్నాలజీ, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ, పీజీఈసెల్ పూర్వ కన్వీనర్ రవీంద్రారెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుండగా…వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలను ఆమోదించినట్లయితే జీవో జారీ అవుతుంది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తున్నారు. పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువగా ఉండటం, ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటంతో ఈ దిశగా అడుగులేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి.

కాగా బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ పరీక్షా విధానం మార్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 2004లో ఇచ్చిన జీవో 168 ప్రకారం అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఈవెంట్స్ కు బదులుగా రాతపరీక్షను నిర్వహించే అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ రాజేశ్ లు సభ్యులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: నిమిషం లేటైతే 5 పరుగులు ఇచ్చుకున్నట్టే.. క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్

Advertisment
Advertisment
తాజా కథనాలు