Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం! బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్. మంగళవారం మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది. By Bhavana 27 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Gold Rates Today : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ గా పెళ్లిళ్లు(Marriages) జరుగుతున్నాయి. చాలా కాలం తరువాత ముహుర్తాలు ఉండడంతో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. సుమారు ఈ సీజన్ లో 42 లక్షల వివాహాలు జరగనున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ క్రమంలో బంగారం కొనే వారు కూడా విపరీతంగా పెరిగారు. పెళ్లి అంటేనే నగలు. మగువలు పెళ్లిలో మరింత అందంగా కనిపించేందుకు నగలనే ఎంచుకుంటారు. ఈ క్రమంలో బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు(Gold Rates) తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది. Gold And Silver Rates : 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62, 830 లుగా ఉంది. వెండి కిలో కు రూ. 100 తగ్గి.. రూ. 74, 400 వద్ద స్థిరపడింది. మంగళవారం మార్కెట్లో బంగారం , వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57, 590 లుగా ఉండగా... 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 62,830 లుగా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,930 లుగా కొనసాగుతుంది. ఇక కోల్ కత్తా(Kolkata) లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57, 590 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,830 లుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,090 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పై రూ. 63, 370 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57, 590 లుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,830 లుగా ఉంది. బంగారం ధరలు ఇలా ఉండగా.. వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. కిలో పై రూ. 100 తగ్గుముఖం పట్టి రూ. 74,400 గా ఉంది. ఇదే ధర ఢిల్లీ(Delhi), ముంబై(Mumbai), కోల్ కతాలో కూడా కొనసాగుతున్నాయి. చెన్నై, కేరళ, హైదరాబాద్(Hyderabad) లో రూ. 75,900 లుగా ఉండగా, బెంగళూరులో రూ. 72,600 లుగా ఉంది. Also Read : దుస్తులు మురికిగా ఉన్నాయంటూ.. రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది! #gold-prices #gold-and-silver-latest-prices #wedding-season #gold-rates-today-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి