Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా బంగారం పట్టివేత! రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తుల వద్ద నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. By Bhavana 01 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ (Hyderabad) లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Rajeev Gandhi International Airport) అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్(Dubai) నుంచి వచ్చిన నలుగురు వ్యక్తుల నుంచి ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఇందులో ఇద్దరు ఆడవారు కూడా ఉన్నారు. వారి వద్ద నుంచి అధికారులు సుమారు 1865. 2 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 1.18 కోట్లు ఉంటుందని తెలిపారు. 16 బంగారు బిస్కెట్లను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 1100 గ్రాముల బంగారాన్ని పట్టుకోన్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు. బంగారు బిస్కట్లను లోదుస్తుల్లో దాచి దుబాయ్ నుంచి తీసుకు వస్తున్న ఇద్దరు కిలాడీలు. ఈ కేసులో నలుగురిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. Also read: అమ్మ కు ప్రేమతో అంటూ ..గరిటె తిప్పిన రాహుల్ గాంధీ! #shamshabad #gold-smuggling #rajeev-gandhi-airport మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి