Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మార్పులు లేని వెండి ధర! హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పది గ్రాములకు 50 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 22 క్యారెట్లు.. రూ. 56,500లుగానూ, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 61,640లుగానూ ఉంది. ఇక వెండి ధరలు కేజీకి రూ.79,000ల దగ్గర స్థిరంగా కొనసాగుతున్నాయి. By KVD Varma 21 Nov 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Gold Price: బంగారం పేరు చెబితే అందరి కళ్ళూ మెరుస్తాయి. కనీసం ఒక్క తులం బంగారమైనా కొనుక్కోవాలి అని అందరూ అనుకుంటారు. దాని కోసమే డబ్బును దాచిపెట్టుకునే వారు చాలామందే ఉంటారు. మన దేశంలో బంగారానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో డబ్బు ఉంటె చాలు మన దేశంలో మహిళలు ముందుగా చూసేది బంగారం కొనాలనే. పెళ్లిళ్లు అయినా పేరంటం అయినా.. బంగారం గురించిన ముచ్చట్లే అతివల మధ్యలో ఎక్కువగా వస్తుంటాయి. అలంకరణ కోసం అనే కాదు.. బంగారం దగ్గర ఉంటె అత్యవసర పరిస్థితిలో అక్కరకు వస్తుంది అని అందరూ భావిస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ గోల్డ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే, బంగారంలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుందనే నమ్మకమే. బంగారానికి ఉండే ఈ డిమాండ్ కారణంగానే రోజూ బంగారం ధరల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. మరి ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం. గతవారం అంతా పరుగులు తీసిన బంగారం ధరలు(Gold Price)సోమవారం నిలకడగా ఉన్నాయి. ఈరోజు (మంగళవారం, నవంబర్ 21) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate) కాస్త తగ్గుదల నమోదు చేశాయి. నిన్నటి ధర కంటే పది గ్రాములకు 50 రూపాయల స్వల్ప తగ్గుదల కనబర్చింది బంగారం. అంతర్జాతీయంగా ధరలు స్థిరంగా ఉండడడంతో మన దేశంలోనూ బంగారం ధరలు బాగా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంటే మంగళవారం (21.11.2023) బంగారం ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో నిన్నటి కంటే బంగారం ధర(Gold Price) స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయలు తగ్గి రూ. 56,500లు గాఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా 50 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 61,640లుగా నిలిచింది. Also Read: ఆగని బంగారం ధరల పరుగు.. 80వేలకు దగ్గరలో వెండి.. ఇక హైదరాబాద్ లో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. సోమవారం కేజీకి రూ.79,000లుగా ఉన్న వెండి అదే ధర వద్ద ఈరోజు కూడా కొనసాగుతోంది. గత వారంలో వెండి ధరలు అనూహ్యంగా పరుగులు తీశాయి. మూడు రోజుల వ్యవధిలో 2 వేల రూపాయలకు పైగా ఎగబాకి 80 వేల రూపాయలను టచ్ చేసే దిశగా దూసుకుపోయాయి. ఇప్పుడు రెండు రోజులుగా స్థిరంగా మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక ఢిల్లీ మార్కెట్లోనూ ఈరోజు బంగారం ధరలు(Gold Price) మార్పులు లేకుండా ఉన్నాయి. 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 56,700 మార్కు వద్ద – 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 61,840 వద్ద ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధరలు 76వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 1982 డాలర్ల వద్ద మార్పులు లేకుండా ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే.. ఇది మాత్రం ఔన్సుకు 23.67 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం. Watch this interesting Video: #silver-price-today #gold-price-down మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి