Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు!

బంగారం (Gold) అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు (Prices)  రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. పండుగల వేళ పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. ఇన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కొంచెం బ్రేక్‌ పడింది.

New Update
Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు!

Gold Price Today: బంగారం అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. పండుగల వేళ పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. ఇన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కొంచెం బ్రేక్‌ పడింది. మంగళవారం నాడు మార్కెట్లో బంగారం 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 55,100 ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,100 గా ఉంది. సోమవారం నాటి మార్కెట్‌ తో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల పై రూ.310 పెరగ్గా..24 క్యారెట్ల పై రూ.340 తగ్గింది.

Also read: అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ!

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55, 250 లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం  ధర (Gold Price) రూ. 60, 260 గా ఉన్నాయి. అటు చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55, 300 లు ఉండా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60, 330 గా ఉన్నాయి. ముంబై, బెంగళూరు , కేరళ వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 లు ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330 గా నమోదు అయ్యింది.

హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.60,100 గా ధరలు ఉన్నాయి. వెండి ధరలు కూడా మార్కెట్లో నేడు రూ. 74,100 గా ఉంది.

వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. ముంబై నగరంలో కిలో వెండి రూ. 74,100 లు ఉండగా చెన్నై లో రూ.77,500 గా ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ. 77,500లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,500గా కొనసాగుతోంది.దీపావళికి బంగారం కొనాలనే ప్లాన్ ఉంటే కొనేయ్యండి. అందుకే బంగారం, వెండి కొనేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదంటే ధరలు మళ్లీ పెరిగి ఛాన్స్ లేకపోలేదు.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..మరో ఇద్దరు!

Advertisment
Advertisment
తాజా కథనాలు