గోదారమ్మ ఉగ్రరూపం.. భద్రాచలంలో టెన్షన్‌

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం (Bhadrachalam)వద్ద గోదావరి (Godavari) నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెండో ప్రమాదం హెచ్చరిక కొనసాగుతోంది.

New Update
గోదారమ్మ ఉగ్రరూపం.. భద్రాచలంలో టెన్షన్‌

భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari nadi) నది మరింత ఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.60 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద లక్షల క్యూసెక్కుల వరద పారుతున్నదున అధికారులు అప్రమత్తమయ్యారు. రహదారులపైకి వరద నీరు చేరిన ప్రాంతాలతోపాటు పొంగుతున్న వాగులు వద్ద దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Godavari flood.. Tension in Bhadrachalam

బయటకు రావద్దు..

రాష్టంలోని ప్రజలందరూ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇంటి వద్దే ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చే అవకావం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.60 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. ఎగువ ప్రాజెక్టుల( project) నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసి రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. 53 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసే ఆవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా 13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పునరావాస కేంద్రాల ముంపు వాసులను తరలిస్తూ.. గోదావరి పరివాహక ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రజల ఆందోళన

వాయుగుండం (vayugundam) ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో గోదావరి నదికి నీరు పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం ముంపు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిన్న (బుధవారం) నెమ్మదించిన వరద ప్రవాహం తగ్గినా.. ఇవాళ (గురువారం) ఉదయం నుంచి క్రమంగా మళ్లీ పెరిగింది. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. భద్రాచలం వద్ద ఆలయ వీధులలో వరద నీరు చేరింది. భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలం-కూనవరం (Bhadrachalam-Koonavaram)రహదారిపైనుంచి వరద ఉధృతంగా పారుతోంది. భద్రాచలం ఏజెన్సీ( Bhadrachalam Agency)లో పలు గ్రామాలు జల దిగ్బంధం( Water blockade)లో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు