TS: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గడ్ మధ్య రాకపోకలు బంద్..!

భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. ఈ వరదల కారణంగా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. మరికొద్ది సేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం గోదావరి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

New Update
TS: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గడ్ మధ్య రాకపోకలు బంద్..!

Bhadrachalam: భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. తెలంగాణ - ఏపీ జాతీయ రహదారి NH - 163పై తూరుబాక వద్ద వరద చేరింది. అలాగే, విజయవాడ - జగ్దల్ పూర్ NH-30పై రాయనపేట వద్ద రహదారిపై కూడా వరద నీరు చేరింది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు.

భద్రాచలం - బూర్గంపాడు మధ్య సారపాక వద్ద రహదారిపైకి సైతం వరద నీరు చేరింది. బీపీఎల్ మీదుగా మోరంపల్లి బంజరకు రాకపోకలు మళ్లించారు. బూర్గంపాడు మండలంలోనూ పలు చోట్ల పంటలు నీటమునిగాయి. మరికొద్ది సేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం వద్ద గోదావరి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.

Also Read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు