Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరికి అంతకంతకూ పెరుగుతోన్న వరద...!!

రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజూ వర్షాలు కొనసాగాయి. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 23.15.సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు కృష్ణా నదిలోకి సైతం తొలిసారి వరద మొదలైంది. అంతేకాక ఉమ్మడి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ సహా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది.

New Update
Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరికి అంతకంతకూ పెరుగుతోన్న వరద...!!

Bhadrachalam: Godavari at Bhadrachalam is getting more and more flood

గోదావరి ఉగ్రరూపం
భద్రాచలం వద్ద గోదావరికి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భద్రాచలం వద్ద 43.4 అడుగుల స్థాయికి గోదావరి నీరు చేరటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ముంపువాసులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు జారీ చేసింది. గోదావరి బేసిన్‌లోని ఎగువ రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో భద్రాచలం వద్ద క్రమంగా గోదావరిలో నీటిమట్టం పెరుగుతుదని అధికారులు వెల్లడించారు. ఈ గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతితో మరోవైపు కృష్ణమ్మ కదిలింది.

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 

రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. శనివారం (జూలై 22) 42.3 అడుగులకు చేరుకున్న నీటిమట్టం.. ప్రస్తుతం 43.3 అడుగులకు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 43 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. మళ్లీ ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 43.3 అడుగులకు చేరి ప్రమాదక హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద నీరు వస్తున్నందున భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం

మరోవైపు గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. రామాలయం ఏరియాలో.. కొత్త కాలనీ ఏరియాలో బ్యాక్ వాటర్ చేరకుండా అధికారులు మోటార్ల ద్వారా నీటిని తోడి బయటకు పంపిస్తున్నారు. కొత్త కాలనీ వద్ద కొంత వరద నీరు చేరడంతో సుమారు 28 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి కొంతమంది ప్రత్యేక అధికారులు వరద పరిస్థితిపై భద్రాచలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

కృష్ణమ్మ పరుగులు

తెలంగాణలోనే కాకుండా ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. శనివారం పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహించింది. ఫలితంగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. మరోవైపు గోదావరి వరద ఉద్ధృతి స్వల్పంగా పెరిగింది. మరోవైపు కృష్ణమ్మ కూడా పరుగులు పెడుతోంది. కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆల్మట్టికి భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భీమానది ఉప్పొంగుతుండటంతో జూరాల ప్రాజెక్టుకు కూడా వరద చేరుతోంది. ఆదివారం ఉదయం నుంచి గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 43.2 అడుగులుగా ఉంది. పోలవరం వద్ద 11.6 మీటర్లగా నీటిమట్టం ఉండగా... ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు