ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీఎం! ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళీ బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. By Bhavana 23 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ACB Raids : ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా (Kakinada District) జనరల్ మేనేజర్ మురళీ బుధవారం రాత్రి ఏసీబీ (ACB) వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ ఆయన రూ.2 లక్షలు మురళి డిమాండ్ చేసారు. బాధితుడు చేసేది ఏమిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. Also read: గొంతుకోసి, ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ దాచి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు! #kakinada #acb-raids #general-manager-murali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి