Smita sabharwal: ఐడియా ఇవ్వండి లక్ష రూపాయలు గెలవండి.. ఐఏఎస్ కీలక ప్రకటన!

ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో సంచలన పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడం కోసం ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలని సూచించారు. ఐడియాను 2024 సెప్టెంబర్ 30 వరకు తమకు పంపించాలని తెలిపారు.

New Update
Smita sabharwal: ఐడియా ఇవ్వండి లక్ష రూపాయలు గెలవండి.. ఐఏఎస్ కీలక ప్రకటన!

Smita sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడంపై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ఒక్క ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఐడియాను 2024 సెప్టెంబర్ 30 చివరి వరకూ పంపించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం tgsfc2024@gmail.com ను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం ఆమె ప్రకటన రాష్ట్రరాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది.

#one-lakh-rupees #innovation-idea #ias-smita-sabharwal
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Trump: రష్యాతో క్రిమియా...ట్రంప్‌!...

Trump: రష్యాతో క్రిమియా...ట్రంప్‌!

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్‌ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్‌ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.

New Update
Trump

Trump

ఉక్రెయిన్‌ -రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని ఆకాంక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ..ఆ రెండు దేశాలు చర్చలు జరిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే సమయంలో ఓ ఇంటర్వ్యూఓ కీలక వ్యాఖ్యలు చేశారు.క్రిమియా రష్యాతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

''క్రిమియాలో అత్యధికంగా రష్యన్‌ భాష మాట్లాడే వారే ఉన్నారు.ఎంతో కాలంగా సబ్‌ మెరైన్లను రష్యా అక్కడ ఉంచింది. ఒబామా హయాంలోనే ఇదంతా జరిగింది. ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్‌ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అని టైమ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పేర్కొన్నారు.

Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో చర్చలను అడ్డుకుంటూ జెలెన్‌ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్ లో నల్ల సముద్రం వెంబడి ఉన్న క్రిమియా వ్యూహాత్మక ప్రాంతం.2014 లో రష్యా దానిని స్వాధీనం చేసుకుంది. తాజాగా ఇదే అంశం పై మాట్లాడిన ట్రంప్‌ ..క్రిమియా రష్యాతోనే ఉంటుందని చెప్పారు.

అయితే ఉక్రెయిన్‌ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన..ఇది సరైన సమయం కాదన్నారు.వారానికి ఐదు వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని , ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్‌కు సూచించారు.

మరో వైపు యుద్ధం ముగింపు కోసం చర్చలు జరిపేందుకు ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ మాస్కోకు వెళ్లారు. పుతిన్‌ తో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి.ఈ పరిణామాల పై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ స్పందిస్తూ ..యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి మాస్కో సిద్ధంగా ఉందన్నారు.

కొన్ని అంశాలు పరిష్కరాం కావాల్సి ఉందన్న ఆయన...అమెరికా అధ్యక్షుడు సరైన మార్గంలో ఆలోచించడం వల్లే ప్రస్తుతం ఈ చర్చలు సరైన దిశలో ముందుకెళ్తున్నాయని చెప్పారు.

Also Read: Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

trump | russia | putin | ukrain | zelensky | putin vs zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | america | latest-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment