HariHaraVeeraMallu Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన 'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని రిలీజ్ చేయగలమా? లేదా అనే టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై 'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది.
ఇప్పటికే మూడు సార్లు
ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు. మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా 2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత 2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్.
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి.
cinema-news | latest-news | harihara-veeramallu-movie
Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..