G20 Summit: కంటికి ఐ ప్యాచ్ తో జర్మనీ ఛాన్సలర్! జర్మనీ ఛాన్సలర్ కంటికి ఐ ప్యాచ్ ధరించి ఈ సమావేశాలకు హాజరు అయ్యారు. కంటికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసుకున్న వారు మాత్రమే అలా కంటికి ఐ ప్యాచ్ ధరిస్తారు. By Bhavana 09 Sep 2023 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి జీ 20 సమావేశాలు ఢిల్లీ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ అధ్యక్షుడు , భారత్ అల్లుడు రిషి సునాక్ లతో పాటు ఇతర దేశాల నాయకులదరూ ఢిల్లీ వేదికగా కలుసుకున్నారు. ఈ క్రమంలో వారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ కూడా హాజరయ్యారు. ఆయనకు భారత ప్రధాని మోడీ భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అయితే జర్మనీ ఛాన్సలర్ కంటికి ఐ ప్యాచ్ ధరించి ఈ సమావేశాలకు హాజరు అయ్యారు. కంటికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసుకున్న వారు మాత్రమే అలా కంటికి ఐ ప్యాచ్ ధరిస్తారు. శనివారం జర్మనీ ఛాన్సలర్ కూడా ఐ ప్యాచ్ తో కనపడడంతో అక్కడ ఉన్న వారు ఏంటా అని ఆరా తీశారు. దీని గురించి జర్మనీ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. జర్మనీ ఛాన్సలర్ స్కల్జ్ 65 ఏళ్ల వయసు వారు. ఆయన గత వారం జాగింగ్ చేస్తున్న సమయంలో అనుకొని ప్రమాదానికి గురి అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కుడి కన్నుకు స్వల్పంగా గాయమైంది. అయితే ఆయన కంటికి గాయాల కారణంగా కొన్ని రోజుల పాటు ఐ ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని ఆ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. #WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO— ANI (@ANI) September 9, 2023 #modi #g20-summit #germon-chancellor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి