C Vigil: ఎవరైనా మీకు తెలిసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? వారిపై ఈసీకి ఇలా కంప్లైంట్ చేయండి!

ECI ప్రవేశపెట్టిన cVIGIL యాప్‌కు ఈ 2 వారాల్లో 79వేల కంప్లైంట్లు వచ్చాయి. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ రిలీజ్ చేసింది. ఇక సీ-విజిల్ యాప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
C Vigil: ఎవరైనా మీకు తెలిసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? వారిపై ఈసీకి ఇలా కంప్లైంట్ చేయండి!

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించేందుకు సి-విజిల్ యాప్ సమర్థవంతమైన సాధనంగా ఎన్నికల సంఘం అభివర్ణించింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు(రెండు వారాల్లో) ఈ యాప్ ద్వారా 79 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో 99 శాతానికి పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు కమిషన్ తెలిపింది. వాటిలో 89 శాతం కంప్లైంట్‌లను 100 నిమిషాల్లో పరిష్కరించారు.

హోర్డింగ్‌లపై భారీగా ఫిర్యాదులు:
అక్రమ బ్యానర్ హోర్డింగ్‌లపై 58,500 ఫిర్యాదులు అందగా.. డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించి 1,400 ఫిర్యాదులు నమోదయ్యాయని కమిషన్ తెలిపింది. ఆస్తుల ధ్వంసంపై మూడు శాతం ఫిర్యాదులు వచ్చాయి. బెదిరింపులపై 535 ఫిర్యాదులు రాగా, 529 పరిష్కరించబడ్డాయి. టైమ్‌ లిమిట్‌ తర్వాత ప్రచారానికి సంబంధించి వెయ్యికి పైగా కంప్లైంట్‌లు అందాయి. ఏడు దశల ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 16న ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి తొలి దశ ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఇది జూన్ 1 వరకు కొనసాగుతుంది. ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

సీ విజిల్ యాప్‌లో ఎలా కంప్లైంట్ చేయాలి?

--> అక్రమాలు జరుగుతున్న సీన్‌ను ఫొటో లేదా వీడియో తీయాలి.

--> లొకేషన్‌ ఆన్‌ చేస్తే జీపీఎస్‌ యాక్టివేట్‌ అవుతుంది.

--> ఫొటో లేదా వీడియో తీయగానే తేదీ, సమయం రికార్డవుతాయి.

--> ఫొటో లేదా వీడియో తీయగానే స్క్రీన్‌ మీద ప్రివ్యూ కనిపిస్తుంది.

--> ఏం తీశామన్న దానిని ఒకసారి చూసి చెక్‌ చేసుకోవాలి.

--> అది ఏ రకమైన అక్రమం అనేదాని కోసం డౌన్‌లిస్ట్‌ చూడాలి.

--> ఏ రకమైన అక్రమం అనేది క్లుప్తంగా రాయాలి.

--> అప్‌లోడ్‌ చేసిన సమాచారం గురించి స్క్రీన్‌ మీద కన్ఫర్మేషన్‌ అడుగుతుంది.

--> ఒకసారి పరిశీలించుకుని కన్ఫర్మ్‌ చేస్తే అది ఫార్వర్డ్‌ అవుతుంది.

--> ఫార్వర్డ్‌ కాగానే సబ్మిట్‌ చేస్తే సక్సెస్‌ అని వస్తుంది.

--> పంపిన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు మెనూలోకి వెళ్లి స్టేటస్‌ ఆప్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read: ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షపై ఈసీ కీలక నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు