TTD: తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు తిరుమలలో ఈరోజు గరుడ వాహన సేవ ప్రారంభం కానున్నది. సాలకట్ల బ్రంహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఉత్సవాల్లోనే వైభవోత్సవం గరుడోత్సవం. రాత్రి 7 గంటలకే గరుడసేవ ప్రారంభం కానున్నది. ఉదయంమే అన్ని గ్యాలరీలుతో భక్తులు నిండి ఉన్నారు. 7 గంటల నుంచి అర్థరాత్రి 2 వరకు వాహన సేవ సాగుతుంది. 2 లక్షలకుపైగా గరుడవాహన సేవను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. By Vijaya Nimma 22 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి తిరుమలలో ఈ రోజు గరుడ వాహన సేవ ప్రారంభం కానున్నది. సాలకట్ల బ్రంహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం, ఉత్సవాల్లోనే వైభవోత్సవం గరుడోత్సవం. రాత్రి 7 గంటలకే గరుడసేవ ప్రారంభం కానున్నది. ఉదయం నుంచి అన్ని గ్యాలరీలలో భక్తులు నిండి ఉన్నారు. రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు వాహన సేవ సాగుతుంది. 2 లక్షలపైగా గరుడవాహన సేవను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. బైక్‌లకు అనుమతించటం లేదు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. (నేడు) శుక్రవారం రాత్రి 7 గంటలకు విశిష్టౖమైన గరుడ వాహన సేవ ఆరంభం కానున్నది. ఈ సేవకు 2.5 లక్షల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత 3 గంటల వరకు ఈ గరుడ సేవను నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. గరుడ సేవ కారణంగా ఇవాళ్టి నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్‌రోడ్డులో బైక్‌లకు అనుమతించటం లేదని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నాణేలు విసరవద్దని భక్తులకు విజ్ఞప్తి అయితే.. స్వామి ఊరేగే వాహనాలపై నాణేలు విసరవద్దని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తులు విసిరే నాణేలు, మిరియాలు, ఉప్పు వంటి పదార్థాల వల్ల స్వామి వారికి అలంకరించే ఆభరణాలు విరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో నిన్న నాలుగో రోజైన ఉదయం కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలసి మలయప్ప పురవీధుల్లో వైభవంగా ఊరేగారు. అనంతరం సాయం సంధ్యావేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకార సేవ కోసం కొలువు మంటపంలో వేంచేపు చేశారు. వేయి నేతి దీపాల వెలుగులో ఉత్సవమూర్తులు ఊయలపై ఊగుతూ భక్తులందరికి దర్శనమిచ్చారు. అనంతరం స్వామివార్లకు బంగారు, వజ్రవైఢూర్య ఆభరణాలతో ఉత్సవరులకు విశేష అలంకరణ చేశారు. అయితే రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించారు. ఈ వాహన సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీవారికి చెన్నై గొడుగులు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి ధరించిన మాలలు గురువారం ( నిన్న) తిరుమలకు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం శ్రీవారి వాహన సేవల్లో అలంకరిస్తారు. ద్వాపరయుగంలో గోదాదేవికి శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం మేరకు శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో వెలసిన గోదాదేవి ధరించిన మాలలు శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవిల్లిపుత్తూరు నుంచి తిరుమలకు వచ్చిన మాలలు, చిలుకలను శ్రీవారి ఆలయానికి అందజేశారు. తిరుమల వెంకటేశ్వరునికి తొమ్మిది కొత్త గొడుగులను చెన్నై హిందూ ధర్మార్థ ట్రస్ట్ సమితి నిర్వాహకులు ఆర్‌ఆర్ గోపాల్‌జీ సమర్పించారు. #tirumala #devotees #garuda-vahana-seva #ttd-makes #huge-arrangements మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి