Crime News: చీమకుర్తిలో రెచ్చిపోతున్న గంజాయి మాఫియా.. నిందితుడు అరెస్ట్

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. బీహార్ కు చెందిన వ్యక్తి నరేష్ సహాని దగ్గర నుండి 3 కేజీల 5 గ్రాముల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు.

New Update
Crime News: చీమకుర్తిలో రెచ్చిపోతున్న గంజాయి మాఫియా.. నిందితుడు అరెస్ట్

Ongole: ఈ మధ్యకాలంలో గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాల ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు పబ్బులలో.. పెద్ద పెద్ద రిసార్టెంట్ లో మాత్రమే దొరికే గంజాయి ఇప్పుడు మామూలు ఏరియాలో కూడా దొరుకుతుంది. రోజురోజుకు గంజాయి మత్తు దేశాన్ని పట్టి పీడిస్తోంది. మెట్రో నగరాలతోపాటు మారుమూల పల్లెల్లోనూ గంజాయి దందా విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన నిఘా పెట్టినా.. వివిధ రూపాల్లో సరాఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాక్లెట్ ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు.

Also Read: కడపలో ఫ్లెక్సీల రగడ.. స్టేషన్ ఎదుట జనసైనికుల ఆందోళన

తాజాగా, ప్రకాశం జిల్లా చీమకుర్తిలోనూ గంజాయి మాఫియా రెచ్చిపోతుంది. ఆంధ్రలో ఎప్పుడూ లేని విదంగా కొత్త తరహాలో గంజాయి చాక్లెట్లు విక్రయస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీ, క్వారీల్లో పని చేస్తున్న వర్కర్లని టార్గెట్ చేసుకుని అమ్ముతున్నట్లు తెలుస్తోంది. చీమకుర్తి మండలంలోని బూధవాడ, మరిచేట్లపాలెం గ్రామంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారని సమాచారం తెలుస్తున్న పోలీసులు ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు. బీహార్ కు చెందిన నరేష్ సహాని దగ్గర నుండి 3 కేజీల 5.గ్రాముల చాక్లెట్లు పట్టుకున్నారు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం

కాగా, గంజాయి చాక్లెట్టు విస్తరించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.  చిన్న పిల్లలు తినే చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతుండడంతో పేరెంట్స్ మరింత భయపడుతున్నారు. ఎందుకంటే పిల్లలు చాక్లెట్లు అనగానే ఎంతో ఇష్టంగా తింటారు..అలాంటి వారికి అసలు గంజాయి అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటప్పుడు తేడాను ఎలా గుర్తిస్తారని ఆవేదన చెందుతున్నారు. ఏ చాక్లెట్ తిన్నా భయపడే పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు