APSRTC : ఏపీలో మహిళకు ఫ్రీ జర్నీ.. ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు జర్నీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు వివరించారు. ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

New Update
APSRTC : ఏపీలో మహిళకు ఫ్రీ జర్నీ.. ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన!

Dwaraka Tirumala Rao : కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress)  అధికారంలో ఉన్న కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana)రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో(RTC Free Journey)  మహిళల(Women's) కు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. ఇదే తీరుగా ఏపీ(AP) లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

ఈ క్రమంలో ఈ వార్తల గురించి ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు(Dwaraka Tirumala Rao) మీడియాతో మాట్లాడి ఓ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు జర్నీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు. ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

భారం పడుతుందని..

ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీ సంస్థ పై ఎలాంటి భారం పడుతుందో వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు తెలిపారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తిరుమల రావు పేర్కొన్నారు.

ఇంటి వద్దకే డెలివరీ..

ఇదిలా ఉంటే సంక్రాంతి(Sankranti) కానుకగా బుధవారం నుంచి ఇంటి వద్దకే డెలివరీ, డోర్‌ పికప్‌, లాజిస్టిక్‌ సేవలను అందుబాటులోనికి తీసుకుని వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి లాజిస్టిక్స్‌ సేవలను ఆర్టీసీ ద్వారా మాత్రమే నిర్వహిస్తామని తిరుమల రావు వివరించారు. ఇంతకు ముందు లాజిస్టిక్ సేవలను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే అనుకున్న ఫలితాలు రాలేదని తెలిపారు.

ఆర్టీసీ లాజిస్టిక్‌ సేవలు..

అందుకే ఆర్టీసీ ద్వారానే లాజిస్టిక్‌ సేవలను జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. www.apsrtclogistics.in వెబ్‌ సైట్‌ నుంచి డోర్‌ పికప్‌ ఉంటుందని ముందుగా ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా విజయవాడలో ప్రారంభించినట్లు తెలపగా..అతి త్వరలో అన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. రెండు వైపులా రిజర్వేషన్‌ చేసుకుంటే టికెట్‌ ధర పై పది శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 1500 సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ద్వారకా తిరుమల రావు వివరించారు.

Also read: ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు