ఇమ్రాన్ ఖాన్‎కు మరో షాక్.. ఎన్నికల్లో పాల్గొనకుండా ఐదేళ్ల అనర్హత వేటు..!!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాధారణ ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల్లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా అనర్హత వేటు చేసింది.

New Update
Pakistan : పాకిస్థాన్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు.. మళ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ పీఎం అయ్యే ఛాన్స్‌..!

Imran Khan Banned From Contesting Elections For Five Years : తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలి...జైళ్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. సాధారణ ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం (Pakistan Election Commission) ...ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. తోషాఖానా కేసులో న్యాయస్థానం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ఎన్నికల సంఘం పాక్ మీడియా కథనాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని నెలల్లోనే పాక్ సాధారణ ఎన్నికలు జరగనుండగా..ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్ కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది.

కాగా పాకిస్తాన్ పార్లమెంట్ గడువు ఆగస్టు 12 వరకు ఉండగా...నేడు దిగువ సభ రద్దుకు సిఫార్స్ చేయాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ పదవీకాలం ఆగస్టు 12తో ముగియనుంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేయాలని, తద్వారా దేశంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి బుధవారం లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ప్రధానమంత్రి షాబాజ్ సిఫార్సును ఆమోదించినట్లయితే, 48 గంటల వ్యవధిలో ప్రభుత్వం రద్దు అవుతుంది. షెడ్యూల్ కంటే మూడు రోజుల ముందుగానే పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి.
మరోవైపు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ (Imran Khan) ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండానే ట్రయల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారంటూ ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ లో పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలనే చర్చ జరుగుతుండగా, తోషాఖానా కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్‌ను ఎన్నికల సంఘం ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించింది. అంతకుముందు, ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన తరువాత, అతన్ని చాలా కట్టుదిట్టమైన భద్రతతో జైలుకు తరలించారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పంజాబ్ ప్రావిన్స్‌లోని జైలులో సి-కేటగిరీ సౌకర్యాలు కల్పించినట్లు వార్తలు వచ్చాయి. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్‌లోని ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించిన వెంటనే ఇమ్రాన్ ఖాన్‌ను శనివారం లాహోర్‌లోని అతని ఇంటి నుండి అరెస్టు చేశారు.

Also Read : Independence Day 2023 : నేటి నుంచి ” మేరీ మాటి మేరా దేశ్” కార్యక్రమం ప్రారంభం…!!

Advertisment
Advertisment
తాజా కథనాలు