మాజీ టీమిండియా క్రికెటర్ కు బ్లడ్ క్యాన్సర్! బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీమ్ఇండియా మాజీ ఆటగాడు అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం కోటీ రూపాయలు విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అన్షుమాన్ గైక్వాడ్‌కు తక్షణమే రూ.కోటి విడుదల చేయాలని (బీసీసీఐ) ని జై షా ఆదేశించారని.’ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. By Durga Rao 14 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి గత ఏడాది కాలంగా లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. 71 ఏళ్ల ఈ మాజీ ఆటగాడికి సాయం చేయాలని కపిల్ దేవ్, మొహిందర్ అమర్‌నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ వంటి మాజీ ఆటగాళ్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేయగా తాజాగా బోర్డు స్పందించింది. ఈ సంక్షోభ సమయంలో గైక్వాడ్ కుటుంబానికి బీసీసీఐ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చినట్లు బీసీసీఐ అపెక్స్ వెల్లడించింది. గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బీసీసీఐ పర్యవేక్షిస్తూనే ఉంటుందని, ఆయన త్వరగా కోలుకోవాలని, అందుకు ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది.ఇక 1974- 87 మధ్య అన్షుమాన్ గైక్వాడ్ భారత్ తరఫున 15 వన్డేలు, 40 టెస్టులు ఆడాడు. అనంతరం భారత జట్టుకు రెండు సార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. #bcci మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి