మాజీ ప్రధాని కన్నుమూత.. గుండెపోటు రావడంతో.. చైనా మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (68) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు చైనా అధికారిక మీడియా శుక్రవారం ఉదయం ప్రకటించింది.లీ దాదాపు పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా పని చేసి విశేష సేవలు అందించారు. గురువారం లీ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 27 Oct 2023 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chinese Former Premier Li Keqiang Died: చైనా మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (68) గుండెపోటుతో శుక్రవారం ఉదయం కన్ను మూసినట్లు చైనా అధికారిక మీడియా శుక్రవారం ఉదయం ప్రకటించింది. సంస్కరణల ఆలోచనలు ఉన్న బ్యూరోక్రాట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లీ కెడియాంగ్ (Li Keqiang) చైనాలో గొప్ప నాయకుడిగా అవుతాకని అంతా భావించారు. కానీ ప్రస్తుత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) వల్ల ఆయన మరుగునపడిపోయారు. లీ దాదాపు పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా పని చేసి విశేష సేవలు అందించారు. గురువారం లీ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. Also read: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు..నేడు తులం ఎంత ఉందంటే! లీ చాలా కాలం నుంచి షాంఘైలోనే నివాసం ఉంటున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆయన ఆధునిక వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. చైనా ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. లీ కి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారనే పేరుంది. యువతను ఉదారవాద భావనల వైపు మళ్లేలా ఆయన ప్రోత్సాహించేవారు. అయితే పార్టీ పరిమితులను ఆయన ఎప్పుడు దాటలేదు. పార్టీ అధినేతగా ఉన్న సమయంలో రక్తదాన శిబిరం ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి చెందడం ఆయనకు చెడ్డపేరు తీసుకువచ్చింది. ఇది ఆయన ఇమేజ్ ను బాగా దెబ్బతీసింది. Also read: టీటీడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ …మీరు అర్హులా..వెంటనే ఆప్లై చేయండిలా! #china #rtv-live #li-keqiang మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి