Malla Reddy : టీడీపీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు.. అధ్యక్ష పదవి కోసం!

బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారని తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు చెబితే రేవంత్ వింటాడని మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
MLA Mallareddy: మాజీమంత్రి మల్లారెడ్డిపై కేసు

Telangana : బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ (TDP) లోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు (Chandrababu) హయాంలో పనిచేసిన మల్లారెడ్డి మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరితే తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారని తన అనుచరులు, బీఆర్ఎస్‌ కౌన్సిలర్లతో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నట్లు సన్నిహిత వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.

పరోక్షంగానైనా సీఎం రేవంత్ కు దగ్గరవ్వాలని.. 
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మల్లారెడ్డి (Malla Reddy) కబ్జా భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. కాగా పరోక్షంగానైనా సీఎం రేవంత్ కు దగ్గరవ్వాలంటే చంద్రబాబుతో దోస్తీకోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెబితే రేవంత్ వింటాడని, తెలంగాణలోనూ పవన్‌కల్యాణ్ హవా ఉందని మల్లారెడ్డి అనుచరులతో కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబుతో మంతనాలు జరిపారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబతున్నారంటూ ప్రచారం జరుగుతోది. అయితే ఈ వార్తలపై స్పందించిన మల్లారెడ్డి
ఇదంతా తప్పుడు ప్రచారమంటూ ఖండిస్తున్నారు.

Also Read : RRR కంప్లైంట్.. ఫిర్యాదులో జగన్ తోపాటు మాజీ IPSల పేర్లు.. ఎవరెవరున్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు