War Rooms : పొగమంచు ప్రభావం..వార్ రూమ్ ల ఏర్పాటు

విమానాల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్ కొనసాగుతుంది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంకోసం విమానయాన శాఖ వార్ రూమ్ లు ఏర్పాటు చేసింది.

New Update
War Rooms : పొగమంచు ప్రభావం..వార్ రూమ్ ల ఏర్పాటు

విమానాలపై పొగమంచు ప్రభావం తగ్గుముఖం పట్టలేదు. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు పొగమంచు నేపథ్యంలో దేశంలోని ఆరు మెట్రో నగరాల పరిధిలోని విమానశ్రయాల వద్ద కేంద్ర పౌర విమానయాన సంస్థ వార్ రూమ్ (War Rooms) లు ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి :TS: ప్రాణాలు తీస్తున్న గాలిపటం..ఇప్పటివరకూ ఎంత మంది చనిపోయారంటే..?

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)తో పాటు ఉత్తరాదిలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీంతో పలు విమానాలు రద్ధు కావడం లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల ఆలస్యం వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్వోపీ) లను జారీ చేసినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ముఖ్యంగా ఢిల్లీ విమానశ్రయం పరిధిలో దట్టమైన పొగమంచు వల్ల విమాన సర్వీసుల సమయాల్లో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఫిర్యాదులు కూడా ఎక్కువయ్యాయి. కొంతమంది ప్రయాణీకులు అసహానంతో పైలెట్ల మీదా దాడులకు తెగబడుతున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ ఎస్వోపీలను జారీ చేసింది. విమానయాన శాఖ జారీచేసిన ఈ మార్గదర్శకాలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ పర్యవేక్షిస్తుందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి :BIG BREAKING: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫిక్స్ చేసిన కాంగ్రెస్!

దేశంలోని ప్రధాన విమానశ్రయాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరు తదితర ఆరు విమానశ్రయాల పరిధిలో వార్ రూమ్ లు ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో విమానాల రాకపోకలపై ప్రతిరోజు  మూడు సార్లు నివేదిక ఇవ్వాలని విమానయాన శాఖ ఆదేశించింది. ఈ ఆరు విమానశ్రయాల పరిధిలో గత కొంతకాలంగా విపరీతంగా పొగమంచు ఏర్పడుతుంది. దీంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. పలు విమానాల రద్దుతో ప్యాసీంజర్లు ఇబ్బందుకు గురవుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వార్ రూములు ఏర్పాటు చేసినట్లు విమానయాన శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు