జోరువానలకు పంట పొలాల్లో చేపలే చేపలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కాకినాడ జిల్లాలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఈ జోరు వానలకు ఉమ్మడి జిల్లాలు తడిచి ముద్దవుతున్నాయి.

New Update
జోరువానలకు పంట పొలాల్లో చేపలే చేపలు

For Joruvans, fish are fish in the crop fields

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల వల్ల జిల్లాలోని పలు ప్రాజెక్టులు, జలాశయాలు నిండుకుండలా మారగా వరద పరిస్థితిని నిరంతరం అధికారులు పర్యవేక్షించిప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే అర్ధరాత్రి నుంచి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఈ వర్షాలకు కాకినాడ రూరల్ నడకుదురు వద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టు పడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పిడింది. వెంటనే స్పందించిన స్థానికులు-పోలీసులు చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గత నాలుగు రోజులుగా వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం రోడ్లపై నీరు ప్రవహిస్తుంది.

చేపల సందడి

ఇక గొల్లప్రోలు జగనన్న ఇళ్లకెళ్లే మార్గంలో శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుంది.గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లాలో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో చెరువులు, వాగులు, వంకలు నిండిగా.. దీంతో జిల్లాలో వివిధ రకాల చేపలు సందడి చేస్తున్నారు. కాకినాడ రూరల్ చీడిగ వద్ద చేపలు కనిపిస్తున్నాయి. దీంతో పంట పొంలం వద్దకు ప్రజలు చేరుకొని చేపలను పడుతున్నారు. వీటిని చూసేందుకు, చేపలు కొనేందుకు చాలా మంది పొలం వద్దకు వెళ్లి.. చేపలు పట్టుకునేందుకు స్ధానికులు ఎగబడుతున్నారు. భారీ చేపలు లభ్యం అయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు