Food Poison: స్కూల్ లో ఫుడ్ పాయిజన్.. 14 మంది అస్వస్థత

యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
Food Poison: స్కూల్ లో ఫుడ్ పాయిజన్.. 14 మంది అస్వస్థత

Food Poison:  యాదాద్రి భువనగిరి సోషల్ వెల్పేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, గుట్టు చప్పుడు కాకుండా స్కూల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Also Read: బాలీవుడ్ రామాయణంలో సాయి పల్లవి..ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. పిల్లలు అనారోగ్యం బారిన పడితే కనీసం సమాచారం ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. విద్యార్ధుల అస్వస్ధతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

జమ్మూకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాక్ ఈ దాడి చేయించిందని అధికారులు అంటున్నారు. ఇది కశ్మీర్‌లో వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల రాకతోనే జీవనోపాధి పొందుతున్నవారి జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి.

New Update

Pahalgam Terrorist Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కశ్మీర్ లోయలోని సామాన్య ప్రజల జీవితం, జీవనోపాధికి తీవ్ర సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఈ దాడిలో ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పి చంపారు. దీంతో కశ్మీర్‌ లో పర్యాటకం ద్వారా జీవనోపాధి పొందుతున్న కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 

కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం...

ఈ దాడిపై జమ్మూ కశ్మీర్ మాజీ పోలీసు చీఫ్ ఎస్పీ వైద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా లోయలో సేవలందించిన ఆయన.. ఈ దాడిని విదేశీ ఉగ్రవాదుల పనిగా అభివర్ణించారు. 'స్థానిక ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడానికి వెనుకాడతారు. ఎందుకంటే అది కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ, ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారికి తెలుసు' అని ఆయన అన్నారు. ఇక లోయలో ఉనికిని వ్యాప్తి చేయాలనుకుంటున్న పాకిస్తాన్ ఆదేశం మేరకు ఈ దాడి జరిగిందని, పర్యాటకులపై దాడి లోయకు పెద్ద దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకునేవారు, కానీ ఇప్పుడు పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ప్రమాదకరమైన కొత్త వ్యూహంగా ఆయన పేర్కొన్నారు.

వేలాది కుటుంబాలు ప్రభావితమవుతాయి..

ఈ దాడి కశ్మీర్‌లోని వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తోంది. హోటల్ నిర్వాహకులు, గైడ్‌లు, చిన్న దుకాణదారులు, పర్యాటకుల రాకతోనే జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరికి పర్యాటకమే జీవనాధారం. అయితే ఈ దాడి తర్వాత పర్యాటకులు తమ బుకింగ్‌లను రద్దు చేసుకుంటారు. హోటళ్లు ఖాళీ అవుతాయి. ప్రజలు కశ్మీర్‌కు రావడానికి భయపడతారని తెలిపారు. అయితే పాకిస్తాన్  కోరుకుంటోంది కూడా ఇదే అన్నారు. 

ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్..

ఢిల్లీ మాజీ పోలీసు చీఫ్, CRPF జమ్మూ కశ్మీర్ జోన్ మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ SN శ్రీవాస్తవ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. 'ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద సంస్థలపై ప్రధాన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ దాడితో కశ్మీర్‌లో తమ ఉనికిని కొనసాగించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన జీవనాధారం. ఇలాంటి దాడులు పర్యాటకాన్ని నాశనం చేయడం కోసమే. ఇదొక కుట్రలో భాగమే. భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నా' అన్నారు.

దీనికి సైన్యం స్పందిస్తుందని..

జమ్మూ కశ్మీర్‌లో ఐదుసార్లు సేవలందించిన లెఫ్టినెంట్ జనరల్ కె. హిమాలయ సింగ్ (రిటైర్డ్) సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాదాపు 25-30 సంవత్సరాల తర్వాత పర్యాటకులపై దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. 'ఇలాంటి సంఘటనలు 1990లలో జరిగాయి. కానీ గత రెండు, మూడు దశాబ్దాలలో పర్యాటకులు సురక్షితంగా ఉన్నారు. ఈ దాడి ఒక పెద్ద ముప్పు. దీనికి సైన్యం సమాధానం ఇస్తుంది' అని చెప్పారు.

 jammu kashmir attack | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment