విజయవాడలో ఫుడ్ కోర్ట్ మాఫియా..జనసేన పోతిన మహేష్ షాకింగ్ కామెంట్స్.!

విజయవాడలో ఫుడ్ కోర్ట్ మాఫియా నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన నేత పోతిన మహేష్. పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ కి వ్యతిరేకంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ నిర్మాణంతో చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
విజయవాడలో ఫుడ్ కోర్ట్ మాఫియా..జనసేన పోతిన మహేష్ షాకింగ్ కామెంట్స్.!

Janasena: విజయవాడ పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ కి వ్యతిరేకంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ..విజయవాడ నగరంలో ఫుడ్ కోర్ట్ మాఫియా నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజా సెంటర్లో ఫుడ్ కోర్టుకు ప్రజాభిప్రాయ, స్థానిక వ్యాపారస్తుల అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. చిరు వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి కాబట్టే కూల్చి వేస్తామని స్పష్టం చేశారు. సామాన్య వర్గాలకు అండగా నిలబడేందుకు కేసులకి రిమాండ్లకు భయపడేది లేదని ఖరకండిగా చెప్పేశారు.

తాంత్రిక పూజలు చేసే వెల్లంపల్లి చూపు పడితే ధ్వజస్తంభాలు కూలిపోతాయని విమర్శలు గుప్పించారు. అందుకనే KBN కళాశాల అవరణలో ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం & ఆంజనేయ వాగులోని ఆంజనేయ స్వామి ఆలయం లోని ధ్వజస్తంభం కూలిపోయాయని ఎద్దెవ చేశారు. ఫుడ్ కోర్టు నిర్మాణం అర్ధరాత్రి పూట ఎందుకు చేస్తున్నారు అసలు నిర్మాణం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Also read: తాగింది నిజమే.. వీడియో తీసింది అందుకే..యూట్యూబర్ నాని సంచలన ప్రెస్ మీట్!

పాతబస్తీలో చిరు వ్యాపారవస్తులను చిన్న భిన్నం చేయడానికి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపించారు. " గంజాయి బ్లడ్ బ్యాచ్ అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి ఫుడ్ కోర్ట్ ఏర్పాటా? . రైల్వే స్టేషన్లో 24 గంటలు క్యాంటీన్స్ అందుబాటులో ఉంటాయి పంజా సెంటర్లో రాత్రి 11.00 గంటల వరకు బిర్యాని పుల్కా టిఫిన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. పాతబస్తీ పశ్చిమ నియోజకవర్గంలో అనేక టిఫిన్ క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయి.. మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు.. వైసీపీ లోని కొంతమంది నాయకుల కోసం పశ్చిమ నియోజకవర్గం చిరు వ్యాపారుల జీవితాలు అన్యాయమైపోవాలా?" అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఫుడ్ కోర్ట్ నిర్మాణం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఆపకపోతే ఏర్పాటు చేసిన తర్వాత అయినా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. కౌన్సిల్లో ఫుడ్ కోర్టు కోసం ప్రతిపాదించింది ముమ్మాటికి స్థానిక కార్పొరేటర్ ఆర్షద్ అని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో అనధికార ఫుడ్ కోట్ల ఏర్పాటుకు అధికార పార్టీకి విఎంసి అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారంటే అవినీతిలో వారి వాటా ఎంతో కమిషనర్ గారు స్పందించాలని కోరారు. విఎంసి అధికారులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? ఫుడ్ కోర్ట్ నిర్మాణం అక్రమమా? సక్రమమా? శాంతి కల్చరల్ అసోసియేషన్ ఎక్కడో ఉంటేనే అనధికారం అన్నారు. పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ పై టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించరన్నారు.

ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఫుడ్ కోర్ట్ ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ముసాఫిర్ ఖానాకు పార్కింగ్ సమస్య పాటు & జండా చెట్టును అవమానిస్తే ముస్లింల మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి తక్షణమే ఫుడ్ కోర్ట్ ను నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు.ఆటో స్టాండ్, పాత బట్టలు అమ్ముకునేవారు, పార్కింగ్, అనేక మంది బ్రతుకులను చిన్నాభిన్నం చేసే ఈ పంజా సెంటర్ ఫుడ్ కోర్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నిరసన చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు